తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్​ ఇచ్చిన బిగ్​బాస్​ - ఒకరు, ఇద్దరు కాదు - ఏకంగా 12 మంది! - Bigg Boss Season 8 Wild Card - BIGG BOSS SEASON 8 WILD CARD

Bigg Boss Season 8 : బిగ్​బాస్​ సీజన్​ 8.. నాలుగో వారంలోకి ఎంటర్​ అయ్యింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ మీద ఉంది. తాజాగా వైల్డ్​కార్డ్​ ఎంట్రీస్​ గురించి ఓపెన్​గా​ చెప్పిన బిగ్​బాస్​.. కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే ట్విస్ట్​ ఇచ్చాడు. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది..

Bigg Boss Season 8
Bigg Boss Season 8 Wild Card Entries (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 5:21 PM IST

Bigg Boss Season 8 Wild Card Entries :బిగ్​బాస్​ సీజన్​ 8లో "ట్విస్ట్​లకు, టర్న్​లకు, ఫన్​లకు.. ఎంటర్​టైన్​మెంట్​కి లిమిటే లేదు" అంటూ హోస్ట్​ నాగార్జున ముందే చెప్పారు. కానీ, షో స్టార్ట్​ అయి ఇన్ని రోజులైనా కూడా పెద్ద షాకింగ్ విషయాలు ఏవీ జరగలేదనేది ఆడియన్స్​ ఫీలింగ్​. అయితే తాజాగా హౌజ్​లోని కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే రేంజ్​లో ట్విస్ట్​ ఇచ్చాడు బిగ్​బాస్​. అది కేవలం హౌజ్​మేట్స్​కు మాత్రమే కాదు.. షో చూసే ఆడియన్స్​కు పెద్ద షాక్​ అనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్​ అయ్యింది. ఆ వివరాలు చూస్తే..

ప్రోమోలో ఏముందంటే..?:హౌజ్​లో సభ్యులందరూ లివింగ్​ రూమ్​లోని సోఫాలో కూర్చున్న తర్వాత.. బిగ్​బాస్​ ఓ పెద్ద భూకంపం రాబోతుందని చెప్పారు. 'మీ మనుగడను సవాల్ చేస్తూ.. మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్లొచ్చు' అంటూ అందరినీ బయపెట్టాడు. అలాగే "ఇప్పటి వరకు బిగ్​బాస్​ చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఐదు కాదు.. ఏకంగా 12 వైల్డ్​కార్డ్ ఎంట్రీలు మరో రెండు వారాల్లో రాబోతున్నాయి" అని ప్రకటించాడు. దీంతో కంటెస్టెంట్లందరూ షాక్​ అయ్యి.. ఓ మై గాడ్​ అంటూ అరిచారు.

అయితే, ఈ సారి వైల్డ్​కార్డ్​ ఎంట్రీస్​కు సంబంధించి మరో ట్విస్ట్​ ఇచ్చాడు బిగ్​బాస్​. అదే వైల్డ్​కార్డ్​ ఎంట్రీలను ఆపే పవర్​. ఈ పవర్ అందరి​ హౌజ్​మేట్స్​కి లభిస్తుంది. అది ఎలా అంటే.. 'సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్' ఛాలెంజ్‌లను గెలవడం ద్వారా. అంటే హౌజ్​లోని 11 మంది సభ్యులు బిగ్​బాస్​ ఇచ్చే 12 ఛాలెంజ్​లను ఆడాలి. ప్రతి ఛాలెంజ్​ని గెలిచినప్పుడల్లా ఒక వైల్డ్​ కార్డ్​ ఎంట్రీని హౌజ్​మేట్స్ ఆపొచ్చు. ఇలా చెప్పగానే కంటెస్టెంట్లకి కాసేపు షాక్​ తగిలినట్లైపోయింది.

ప్లాన్​ ఇదే కావొచ్చు!!:బిగ్​బాస్​ 12 టాస్కులు పెడితే ఎలాగూ అన్నింట్లోనూ గెలవలేరు.. అలా అని ప్రతి టాస్క్​లో ఓడిపోరు కూడా. దీంతో "ఆరు టాస్కుల్లో గెలిచి 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీలను మీరు ఆపారు.. కాబట్టి మరో 6 మంది ఇంటి సభ్యులు ఎంట్రీ ఇస్తున్నారంటూ" బిగ్‌బాస్ ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఈ ఆరుగురు సభ్యులు బిగ్‌బాస్ గ్రాండ్ లాంఛ్ 2.0లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

ఈ నలుగురు సభ్యులు వైల్డ్​కార్డ్ ఎంట్రీలుగా ఫిక్స్!​ :ఇప్పటికే వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ గురించి సోషల్​ మీడియాలో రకరకాల వార్తలు వైరల్​ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమోలో కూడా బిగ్​బాస్​ చెప్పడంతో సీజన్​ 7 మాదిరే సీజన్​ 8లో కూడా మినీ ఈవెంట్​ను ప్లాన్​ చేసి వైల్డ్​ కార్డ్​ ఎంట్రీస్​ను హౌజ్​లోకి పంపిస్తారని సమాచారం. అయితే ఈ సీజన్​లో వైల్డ్​కార్డ్​ ఎంట్రీస్ ఇచ్చే వారిలో కొంతమంది మాజీ సభ్యులున్నారని.. వారిలో ఈ నలుగురు కన్ఫార్మ్ అయినట్లు టాక్​. వారు.. ముక్కు అవినాష్, కమెడియన్​ రోహిణి, హరితేజ, నయని పావని. అయితే మినీ లాంచ్​ ఈవెంట్​ వచ్చే నెల అక్టోబర్​ 6వ తేదీన జరగబోతోందని సమాచారం..

ఇవి కూడా చదవండి:

బిగ్​బాస్​ 8: ఊహించని ట్విస్ట్​ - ఆ ఇద్దరిలో బయటికి వెళ్లేది ఆమేనటగా!?

బిగ్​బాస్​ 8: వైల్డ్​కార్డ్​ ఎంట్రీ బ్యాచ్​ సిద్ధం! - వచ్చేది వీళ్లేనటగా!

ABOUT THE AUTHOR

...view details