Bigg Boss 8 Telugu Naga Manikanta:"గెలిచి తీరాలి అప్పుడే నా భార్య, నా కూతురు నాకు దక్కుతారు" అంటూ బిగ్‌బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు నాగ మణికంఠ. అంతేకాదు ఇప్పటివరకూ జరిగిన ఆరు వారాల గేమ్‌లో చాలా సందర్భాల్లో "నా భార్య నాకు కావాలి, నా కూతురు నాకు కావాలి" అంటూ ఎమోషనల్ కూడా అయ్యాడు. దీంతో "అసలు వాళ్ల భార్యతో మణికంఠకు ఉన్న గొడవలేంటి? ఆమె కూతురితో పాటు అమెరికాలోనే ఎందుకు ఉంటుంది?" అంటూ ఆడియన్స్ మందిలో చాలానే ప్రశ్నలు మిగిలిపోయాయి. కానీ వీటి గురించి ఇప్పటివరకూ మణికంఠ అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ సీక్రెట్‌ను మాత్రం హౌజ్‌లో రివీల్ చేశాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాకతో హౌజ్‌లో సందడి మొదలైంది. అటు టాస్కుల పరంగా, ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కంటెస్టెంట్లు ఇరగదీస్తున్నారు. ముఖ్యంగా మొదటి ఐదు వారాల్లో ఎమోషనల్‌గా ఉన్న మణికంఠకూడా వైల్డ్ కార్డ్స్ రాకతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలైన గంగవ్వ, అవినాష్, టేస్టీ తేజ, హరితేజలతో.. తన భార్య తనకి పంపిన లెటర్ గురించి మణికంఠ చెప్పాడు. లెటర్‌లో హాయ్ జూనియర్అంటూ రాసింది అంటూ మణికంఠ చెప్పగానే.. అదేంటి జూనియర్ అని ఎందుకు పిలిచింది అంటూ అందరూ అడిగారు.
దీనికి "అంటే తను నన్ను కన్నా, జూనియర్ అంటుంది.. తన ఫోన్‌లో నా నంబర్‌ను జూనియర్ అని సేవ్ చేసుకుంటుంది" అంటూ మణికంఠ చెప్పాడు. అంటే మీరు ఇద్దరూ సేమ్ కాలేజా.. అంటూ తేజ అడిగాడు. కాదు తనకంటే నేను 3 ఏళ్లు చిన్నోడిని అందుకని అలా జూనియర్ అంటుంది అంటూ షాకిచ్చాడు మణికంఠ. ఇక ఇది విని అవునా అంటూ అందరూ అవాక్కయ్యారు. ముఖ్యంగా గంగవ్వ అయితే "ఎవరికంటే చిన్నోడు వాళ్ల భార్య కంటేనా?" అంటూ నోరెళ్లబెట్టింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు అయితే మణికంఠ ఈ సీజన్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తూనే ఉన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.