తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​ బాస్​ 8: హౌజ్​లోకి 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్ - వాళ్లు ఎవరు, ఎప్పుడొస్తున్నారో తెలుసా? - BB 8 Wild Card Entries Details - BB 8 WILD CARD ENTRIES DETAILS

Bigg Boss 8 Wild Card: బిగ్​బాస్​ సీజన్​ 8లో వైల్డ్​కార్డ్​ ఎంట్రీస్​ గురించి బిగ్​బాస్​ డైరెక్ట్​గా చెప్పేశారు. 12 మంది ఇంట్లోకి వస్తారని.. అయితే వారిని ఆపే పవర్​ని కూడా కంటెస్టెంట్లకు ఇస్తూ​ ఛాలెంజ్‌లు ఆడాలని సూచించారు. దీంతో.. హౌజ్​లోకి ఎంట్రీ ఇచ్చేవారి సంఖ్య 9 మందికి పడిపోయింది. మరి వారు ఎవరు? ఎప్పుడు వస్తారు? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Bigg Boss 8 Wild Card
Bigg Boss 8 Wild Card (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 27, 2024, 12:35 PM IST

Bigg Boss 8 Wild Card Entries Details:"సర్వైవల్ ఆఫ్‌ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌"లో భాగంగా మొత్తం 5 టాస్కులు నిర్వహించారు బిగ్​బాస్​. మొదటి టాస్క్​.. 'బాల్‌ను పట్టు టవర్‌లో పెట్టు'. 10 నిమిషాల సమయంలో ఐదు బాల్స్‌ను ఓ స్టిక్స్‌పై బ్యాలెన్స్ చేస్తూ టవర్లో వేయాలి.. ముందుగా ఎవరు వేస్తే వాళ్లు విన్నర్.. రెండూ టీమ్‌లూ వేయలేకపోతే ఇద్దరూ ఓడిపోయినట్లే అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. ఇక ఈ టాస్క్​లో కాంతారా టీమ్​ గెలిచి.. లక్ష రూపాయల ప్రైజ్​ మనీ గెలుచుకోవడంతో పాటు ఒక వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ నెంబర్​ తీసేశారు.

రెండో టాస్క్​లో 'ఈట్ ఇట్ టూ బీట్ ఇట్' అనే ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా మహాథాలీని 40 నిమిషాల్లో పూరి చేయాలి అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఈ టాస్క్​లో ఎవరూ గెలవలేదు. మూడో టాస్క్​.. 'పట్టుకునే ఉండు.. లేదా పగిలిపోతుంది'. ఈ గేమ్‌లో భాగంగా 15 నిమిషాల పాటు ఫ్రేమ్ మీద హ్యాండిల్‌కి కట్టి ఉన్న బెలూన్‌ను పగలగుండా చూసుకోవాలి. ఇక ఈ టీమ్​లో శక్తి టీమ్​ గెలిచింది. దీంతో ఇప్పటి వరకు పెట్టిన మూడు టాస్కుల్లో ఒకటి కాంతార టీమ్​ గెలిస్తే.. రెండోది శక్తి టీమ్​ గెలిచింది. మరొకటి ఎవరూ గెలవలేదు.

సర్వైవల్ ఆఫ్‌ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్‌లో భాగంగా నాలుగో టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఇచ్చిన టైంలో పజిల్ బ్లాక్‌ను ఉపయోగించి క్యూబ్ షేప్ నిర్మించాలి.. రెండూ టీమ్‌ల నుంచి చెరో ఇద్దరు ఆడాలి.. ఎవరు త్వరగా క్యూబ్ నిర్మిస్తే వాళ్లు విన్నర్. కానీ ఇచ్చిన టైమ్‌లో రెండు టీమ్‌లు గేమ్ ఫినిష్ చేయలేకపోయాయి. దీంతో క్యూబ్ టాస్కు ఎవరూ గెలవలేదు.

కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాక్​ ఇచ్చిన బిగ్​బాస్​ - ఒకరు, ఇద్దరు కాదు - ఏకంగా 12 మంది!

కాసేపటికి ఐదవ టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. బీబీ ట్యూన్స్‌కి డ్యాన్స్ చేయాలి. ఈ గేమ్‌లో ఐదు రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మాత్రమే మిగిలారు. శక్తి టీమ్ నుంచి ఇద్దరు ఉండటంతో వాళ్లనే విన్నర్‌గా ప్రకటించాడు బిగ్‌బాస్. దీంతో ప్రైజ్ మనీలో మరో లక్ష రూపాయలు యాడ్ చేశాడు.. అలానే మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాడు. అయితే ఎపిసోడ్ చివరిలో 'సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్' ఛాలెంజ్ ఇంతటితో ముగిసింది.. మీరు మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపగలిగారు.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. అంటే ఇంకా మిగిలిపోయిన 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నమాట.

ఎవరు, ఎప్పుడంటే:ఇప్పటి వరకు వైల్డ్​ కార్డ్​ ఎంట్రీ ఇచ్చేది వీళ్లే అంటూ చాలా మంది పేర్లే వినిపించాయి. వారిలో చాలా మంది కన్ఫామ్మ్​ అయినట్లే అని కూడా సమాచారం. వారెవరో చూస్తే.. హరితేజ, రోహిణి, అవినాష్​, నయని పావని, శోభా శెట్టి, టేస్టీ తేజ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంకా రీతూ చౌదరి, కావ్య, గౌతమ్​ కృష్ణ కూడా వస్తారని అంటున్నారు. ఇక ఈ వైల్డ్​ కార్డ్​ ఎంట్రీలు అక్టోబర్​ 6వ తేదీన హౌజ్​లోకి ఎంటరవుతారని సమచారం. అయితే బిగ్​బాస్​ చెప్పినట్లు నిజంగానే తొమ్మిది మంది వైల్డ్​ కార్డ్​ ద్వారా వస్తారా..? లేకుంటే ఇందులో కూడా ఏమైనా ట్విస్ట్​ ఉందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్​ చేయాల్సిందే..!

బిగ్​బాస్​ 8: "అది కంప్లైంట్​ చేయడానికి నువ్వు ఎవరు" - నబీల్​ వర్సెస్​ సోనియా! - నామినేషన్ల రచ్చ

బిగ్​బాస్​ 8: "ముందైతే కొడతా - ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది" - హాట్​హాట్​గా నాలుగో వారం నామినేషన్లు!

ABOUT THE AUTHOR

...view details