తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8: శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు అసలు కారణం ఇది! - రెమ్యునరేషన్​ వివరాలు కూడా లీక్​ - Bigg Boss Shekar Basha Elimination - BIGG BOSS SHEKAR BASHA ELIMINATION

Shekar Basha Elimination: బిగ్‌బాస్​ 8లో రెండోవారం గడిచిపోయింది. తొలివారం బేబక్క వెళ్లిపోగా.. ఊహించని విధంగా చాలా వారాలు ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ బాషా రెండో వారంలోనే ఇంటిబాట పట్టాడు. అయితే స్ట్రాంగ్​ కంటెస్టెంట్​గా ఉన్న శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు​ అసలు కారణం తెలిసిపోయింది. అంతే కాదు అతని రెమ్యునరేషన్​ కూడా లీక్​ అయ్యింది!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 10:17 AM IST

Bigg Boss 8 Shekar Basha Elimination:బిగ్‌బాస్​లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. తొలివారం బేబక్క ఎలిమినేట్​ అవుతుందని మెజార్టీ పీపుల్​ భావించారు. అదే జరిగింది. కానీ రెండో వారంలో శేఖర్​ బాషా ఎలిమినేట్​ అవుతారని చాలా మంది అనుకోలేదు. అయితే స్ట్రాంగ్​ కంటెస్టెంట్​గా ఉన్న శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు​ కారణం ఏంటో తెలిసింది. అంతే కాదు అతని రెమ్యునరేషన్​ విషయం కూడా వైరల్ అవుతోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సాధారణంగా ఆడియన్స్​ వేసే ఓట్లను బట్టి బిగ్​బాస్​ షోలో ఎలిమినేషన్​ ప్రక్రియ ఉంటుంది. తమకు ఏ కంటెస్టెంట్​ కావాలో? ఎవరు వద్దో డిసైడ్​ చేసుకునేది ప్రేక్షకులు మాత్రమే. అయితే కొన్నిసార్లు ఆడియన్స్​ ఓట్లను బట్టి కాకుండా బిగ్​బాస్​ టీమ్​ నిర్ణయాల వల్ల కూడా స్ట్రాంగ్​ అనుకున్న కంటెస్టెంట్లు హౌజ్​ నుంచి బయటకు వెళ్తుంటారు. ఈసారి శేఖర్​ బాషా విషయంలో కూడా అలానే జరిగింది. ఇదే విషయాన్ని హోస్ట్ నాగార్జున​ కూడా కన్ఫామ్​ చేశారు.

"బాటమ్ 2లో ఆడియన్స్ సెలక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు. కానీ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవరుంటారు.. ఇంటి బయటికి ఎవరొస్తారనేది ఈసారి హౌస్‌మెట్స్ డిసైడ్ చేయబోతున్నారు." అంటూ నామినేషన్లలో మిగిలిపోయిన శేఖర్ బాషా, ఆదిత్యల గురించి నాగ్ చెప్పారు. ఆ తర్వాత వీళ్లలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది హౌస్‌మేట్స్ రీజన్ చెప్పి డిసైడ్ చేయాలని నాగ్ అన్నారు. ఇక దీనికి ఆడియన్స్ తప్పుపట్టకూడదని "హౌస్ బయట విషయాలు కాదు.. లోపల విషయాలను పరిగణించే రీజన్ చెప్పాలి" అంటూ ఇండైరెక్ట్‌గా శేఖర్ భార్య డెలివరీ గురించి నాగ్ హింట్ ఇచ్చారు.

బిగ్​ బాస్​లో లవ్​ బర్డ్స్! - వాళ్ల మధ్య లవ్ ట్రాక్ కన్ఫామ్ అంటగా?

ఎలిమినేషన్​ ప్రక్రియ ఇలా జరిగింది:దీంతో ఓవైపు శేఖర్ బాషా, మరోవైపు ఆదిత్యలను నిల్చోబెట్టి ఎవరు హౌజ్​లో ఉండాలని మీరు అనుకుంటే వాళ్ల మెడలో పూలదండ వేయండంటూ కంటెస్టెంట్లకు నాగ్ చెప్పారు. దీంతో శేఖర్, ఆదిత్యలను తీసేయగా ఉన్న 11 మంది హౌజ్​మేట్స్‌ ఒక్కొక్కరిగా తమ డెసిషన్ చెప్పారు. ఒక్క సీత మినహా మిగిలిన 10 మంది ఆదిత్య మెడలోనే దండేశారు. దీంతో హౌజ్​మేట్స్​ నిర్ణయం ప్రకారం శేఖర్ బాషాను ఎలిమినేట్ చేశారు నాగార్జున.

శేఖర్​ బాషా ఎలిమినేషన్​కు కారణం ఇదే:ఈ డెసిషన్ చెప్పగానే శేఖర్ అయితే చాలా ఎమోషనల్‌గా ఆనందపడ్డాడు. ఇది నాకు చాలా అవసరం. దీన్ని పాజిబుల్ చేసిన మీ అందరికీ థాంక్యూ అంటూ శేఖర్ అన్నాడు. ఇక శేఖర్ వెళ్లిపోతున్నాడని సీత, విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయి ఏడ్చారు. కానీ నేను సంతోషంగా వెళ్తున్నా ప్లీజ్ ఇలా పంపొద్దు అని శేఖర్ అన్నాడు. అయితే.. ఇంతకీ శేఖర్ వెళ్లడానికి కారణం.. తన భార్య డెలివరీ కావడమేనట. ఈ కారణంగానే అతను హౌజ్​ నుంచి బయటికి రావాలని అనుకున్నాడట! దీంతో.. ఆడియన్స్ వేసిన ఓట్ల ప్రకారం కాకుండా శేఖర్ ఇష్టపూర్వకంగా, బిగ్‌బాస్ నిర్ణయంతో ఈ వారం ఎలిమినేషన్ జరిగిందని సమాచారం. శేఖర్‌కి హౌస్‌మేట్స్ చాలా ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదిత్య తన మెడలో ఉన్న దండలన్నీ శేఖర్ మెడలో వేసి.. నబీల్, ఆదిత్య కలిసి శేఖర్‌ను భుజాలపై ఎత్తుకొని మరీ సాగనంపారు.

పారితోషికం ఎంత? : శేఖర్​ బాషా రెమ్యునరేషన్​ వివరాలు కూడా లీక్​ అయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. వారానికి రూ.2.5 లక్షలు చొప్పున రెండు వారాల్లో రూ.5 లక్షల్ని ఇతడు సొంతం చేసుకున్నట్టు సమాచారం.

బిగ్ బాస్ 8 : నాగమణికంఠ భార్య ఎవరో తెలిసిపోయిందిగా - పెళ్లి వీడియో వైరల్!

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details