Bigg Boss 8 Telugu Ninth Week Elimination: బిగ్‌బాస్ సీజన్ 8 తొమ్మిదో వారం చివరకు వచ్చేసింది. సీజన్ 8 మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు హౌజ్ నుంచి బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓమ్, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్ దిల్సే ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం ఎవరు ఇంటికి వెళ్లనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం నామినేషన్స్‌లలో ఉన్నది ఎవరు? ఓటింగ్‌లో ఎవరు చివరన ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
ఐదు రోజులు జరిగింది ఇదే: వైల్డ్‌కార్డ్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత జరిగిన నామినేషన్లు అన్నీ రెండు రోజుల పాటు జరగగా.. ఈ తొమ్మిదో వారం నామినేషన్లు మాత్రం ఒక్కరోజే జరిగాయి. ప్రతిసారి కంటెస్టెంట్లు నామినేట్ చేయగా.. ఈసారి అధికారాన్ని మెగాచీఫ్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ లెక్కన మొదట ఐదుగురు టేస్టీ తేజ, ప్రేరణ, నబీల్, గౌతమ్, నయనిపావని ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత కంటెస్టెంట్లకు అవకాశం ఇస్తూ స్వాప్ ఆప్షన్ ఇవ్వగా.. నామినేషన్ల ప్రక్రియ ముగిసే సరికి గౌతమ్, యష్మీ, టేస్టీ తేజ, హరితేజ, నయని పావని నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఆ తర్వాత రోజుల్లో రెండు క్లాన్స్‌ను ఒకటే క్లాన్‌గా పెట్టి హౌజ్‌మేట్స్‌ను నాలుగు టీమ్‌లుగా డివైడ్ చేసి బీబీ ఇంటికి దారేది అనేది టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్. ఇక అందులో చివరి వరకు ఉండిఅవినాష్ఇంటికి మెగా చీఫ్ అయ్యాడు. ఇక దీపావళి సందర్భంగా ఇంటి నుంచి వచ్చిన వీడియోలను ప్లే చేసి కంటెస్టెంట్లకు సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్.
అన్అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది:సోమవారం నామినేషన్స్ జరగగా.. ఆ రాత్రి నుంచే మొదలైన ఓటింగ్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఇక అన్అఫీషియల్ ఓటింగ్ చూస్తే.. మొన్నటి వరకు టాప్ ప్లేస్‌లో నిలిచిన యష్మీ సడెన్‌గా రెండో స్థానానికి పడిపోయింది. ఇక రెండో స్థానంలో ఉన్న గౌతమ్ మొదటి ప్లేస్‌కు ఎగబాకాడు. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కూడా మార్పులు చేసుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే మొదటి ప్లేస్‌లో గౌతమ్, రెండో ప్లేస్‌లో యష్మీ, మూడో ప్లేస్‌లో నయని పావని, నాలుగో స్థానంలో టేస్టీ తేజ, ఐదో స్థానంలో హరితేజ ఉన్నారు. అయితే ఈ సారి నామినేషన్స్ లిస్ట్‌లో తక్కువ మంది ఉండటం వల్ల చివరి మూడు స్థానాల్లో ఉన్న వారు డేంజర్ జోన్లో ఉన్నారని సమాచారం..