Bigg Boss 8 Telugu Diwali Special Episode:బిగ్‍బాస్ తెలుగు సీజన్ 8 నేడు ఎనిమిదో వారం చివరికి వచ్చేసింది. ఇక ఆదివారం ఎపిసోడ్ అంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎలిమినేషన్లు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం దీపావళి నేపథ్యంలో ఈరోజు మరింత స్పెషల్గా ఉండబోతుంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మొదటి ప్రోమోలో ఎప్పటిలాగే స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ఆ తర్వాత అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పడంతో నేటి ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. ఈక్రమంలోనే అమరన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు బిగ్‍బాస్‍కు వచ్చారు తమిళ హీరో శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవిని హోస్ట్ కింగ్ నాగార్జున ప్రశంసించారు. "ఆడియన్స్ స్టార్స్, వీళ్లు యాక్టర్స్. కానీ స్టార్ యాక్టర్" అంటూ సాయిపల్లవిని నాగ్ చూపించారు. ఆ తర్వాత అవినాశ్‍పై నాగార్జున పంచ్ వేశారు. "వైఫ్ అనూ ఫొటో తెచ్చుకున్నాడు. హౌస్‍లో తాను చేసే పనులు తెలియకూడదని ఆ ఫొటో ఇలా మూసేస్తాడు" అని నాగ్ కౌంటర్ వేశారు.
ఇక ఆ తర్వాత సోగ్గాడే చిన్ని నాయనా పాటకు అనసూయ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. హౌస్‍మేట్స్ కూడా దుమ్మురేపారు. ఈ క్రమంలో అవినాష్.."ఐ లవ్యూ అను.. ఓ ఈ అను.. కాదు.. ఈ అనసూయను రెండు రాష్ట్రాల కుర్రాళ్లు లవ్ చేస్తున్నారు" అంటూ డైలాగ్ కొట్టాడు. ఆ తర్వాత కంటెస్టెంట్లకు "ట్రెజర్ హంట్" గేమ్ ఉండనున్నట్టు కింగ్ చెప్పారు. ఈ క్రమంలో అనసూయ అత్తారింటి మైథిలి భాష గురించి మాటలు సాగాయి. "కాదు కాదు.. మీ అత్తగారి భాష మీకే రాకపోతే మాకెలా అర్థమవుతుంది" అంటూ రోహిణి పంచ్ వేశారు. దీంతో రోహిణి అనిపించుకున్నావని అనసూయ అన్నారు.
బిగ్‍బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ, పృథ్వీరాజ్ బ్రేకప్ - అర్ధరాత్రి ఏం జరిగింది?
ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమా హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఈ ఎపిసోడ్‍లో సందడి చేశారు. "దుల్కర్ సల్మాన్‍తో ఎవరైనా లవ్ స్టోరీ చేస్తారనుకుంటాం" అని డైరెక్టర్ వెంకీ అట్లూరిని నాగార్జున ప్రశ్నించారు. దీంతో "లక్కీ భాస్కర్ కూడా లవ్ స్టోరీనే, అయితే ఇది మనిషికి, డబ్బుకి మధ్య" అని వెంకీ చెప్పారు. తనకు డిఫరెంట్ మూవీ చేయాలని అనిపించి లక్కీ భాస్కర్ చేసినట్టు దుల్కర్ తెలిపారు. ఆ తర్వాత ఓ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది.