Bigg Boss BB Intiki Daredi Task:బిగ్‌బాస్ హౌజ్‌లో తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఈ లిస్ట్‌లో టేస్టీ తేజ, నయని పావని, హరితేజ, గౌతమ్, యష్మీ ఉన్నారు. ఇక మంగళవారం ఎపిసోడ్ నాటికి సంబంధించిన ప్రోమోలో క్లాన్స్ విషయంపై ఓ ప్రకటన చేశారు బిగ్‌బాస్. దీంతో హౌజ్ అంతా ఒక్కటైంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
బిగ్‌బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత హౌజ్‌ని రెండు క్లాన్స్‌గా డివైడ్ చేసిన సంగతి తెలిసిందే. పాత కంటెస్టెంట్లు అందరినీ కలిపి ఓజీ క్లాన్‌గా.. కొత్త వాళ్లని రాయల్స్ క్లాన్‌గా విభజించారు. దీంతో వచ్చినప్పటి నుంచి ఈ రెండు క్లాన్స్ మధ్య గేమ్ విషయంలో ఫైట్ జరుగుతోంది. అయితే ఇక నుంచి హౌజ్ మొత్తం కలిపి ఒకే మెగా క్లాన్‌గా ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు. అంతేకాదు ఈసారి వైల్డ్ కార్డ్స్, పాత కంటెస్టెంట్లను కలిపి నాలుగు టీమ్‌లుగా డివైడ్ చేశాడు బిగ్‌బాస్. వీళ్ల మధ్య తాజాగా టాస్కులు స్టార్ట్ చేశాడు.
బిగ్‌బాస్ వదిలిన లేటెస్ట్ ప్రోమోలో క్లాన్స్ విషయంపై ముఖ్యమైన ప్రకటన చేశారు. "హౌజ్‌లో మీ ప్రయాణం మూడు క్లాన్స్‌గా మొదలైంది.. ఇప్పటి నుంచి ఉండబోయేది ఒకే ఒక మెగా క్లాన్.. అదే బీబీ క్లాన్" అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. ఆ తర్వాత మొత్తం ఇంటి సభ్యులను నాలుగు టీమ్‌లుగా డివైడ్ చేశారు. ఏ టీమ్‌లో ఎవరున్నారో చూస్తే..
గ్రీన్ టీమ్:టేస్టీ తేజ, విష్ణుప్రియ, నబీల్
బ్లూ టీమ్:నిఖిల్, అవినాష్, గంగవ్వ, హరితేజ
ఎల్లో టీమ్:నయని, పృథ్వీ, రోహిణి
రెడ్ టీమ్:గౌతమ్, ప్రేరణ, యష్మీ
తొలి టాస్కు ఇదే: ఇక ఈ నాలుగు టీమ్స్‌కి కలిపి ఓ టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. అదే బీబీ ఇంటికి దారేది. "ఈ ఛాలెంజ్‌లో గెలవాలంటే కంటెస్టెంట్ల ముందున్న వివిధ భాగాలను ఉపయోగించి మీ టీమ్‌కి సంబంధించిన స్నో మ్యాన్‌ను ముందుగా పూర్తి చేయాలి" అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు. ఇక ఈ టాస్కుకి గంగవ్వను సంచాలక్‌గా పెట్టాడు బిగ్‌బాస్. ఇక అలా బజర్ మోగిందో లేదా.. వెంటనే నాలుగు టీమ్స్ మెంబర్స్ ఒకేసారి పోటాపోటీగా స్నో మ్యాన్‌ను తయారు చేసే పనిలో పడ్డారు.
ఈ టాస్కు మధ్యలో గ్రీన్ టీమ్ కింద పడిపోయింది.. అంటే విష్ణుప్రియ-నబీల్-తేజ ఉన్న టీమ్. మరోవైపు బ్లూ-రెడ్ టీమ్‌లు పోటాపోటీగా ఆడాయి. అయితే ఈ టాస్కులో బ్లూ టీమ్(హరితేజ-నిఖిల్-అవినాష్-గంగవ్వ) విజేతలుగా నిలిచినట్లు సంచాలకురాలు గంగవ్వ ప్రకటించింది. దీంతో వాళ్లకి ఓ ప్రత్యేక ప్రయోజనాన్ని అందించాడు బిగ్‌బాస్.
"హరితేజ స్టోర్ రూమ్‌లో ఉన్న ఎల్లో కార్డ్‌ని.. ఏ టీమ్‌కి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్లకి ఇచ్చేయండి" అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో కొద్దిసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నడిచింది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ప్రకారం.. ఈ ఎల్లో కార్డును ఎల్లో టీమ్‌కి (నయని-పృథ్వీ-రోహిణి) ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా టాస్కులో విన్ అయిన ప్రతిసారి గెలిచిన టీమ్ డైస్ వేసే ఛాన్స్ దక్కించుకుంటుంది. అలా డైస్ వేసినప్పుడు వచ్చే పాయింట్లు ఆ టీమ్ ఖాతాలో ఉంటాయి. ఇలా ఎవరు ఎక్కువ పాయింట్లు సాధిస్తే వాళ్ల టీమ్ చీఫ్ కంటెండర్లుగా నిలిచే ఛాన్స్ ఉందన్నమాట. అయితే తాజా సమాచారం ప్రకారం రెండో టాస్క్ గ్రీన్ టీమ్(టేస్టీ తేజ - నబీల్ - విష్ణుప్రియ) గెలిచినట్లు తెలుస్తోంది.
బిగ్‌బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ, పృథ్వీరాజ్ బ్రేకప్ - అర్ధరాత్రి ఏం జరిగింది?
"తమ్ముడంటే జెలస్ - త్వరలోనే స్ట్రెయిట్ తెలుగు సినిమా" - బిగ్‌బాస్‌లో హీరో సూర్య సందడి!
"పక్కనోళ్ల బాధ గురించి వాడికి అక్కర్లేదు" - "వాడికి అదే సమస్య" - నాగ మణికంఠ చెల్లెలు షాకింగ్ కామెంట్స్!