తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

"ఏంటి ఆ చూపేంటి - నన్ను చూసినా విధానం తప్పు​" - పృథ్వీపై రోహిణి సీరియస్​ - రంజుగా నామినేషన్లు! - BB8 TELUGU 8TH WEEK NOMINATIONS

-విష్ణు ప్రియ - నిఖిల్​ మధ్య మాటల యుద్ధం -ఈ వారం నామినేట్​ అయ్యింది ఎంతమందంటే!

Bigg Boss 8 Telugu 8th Week Nominations
Bigg Boss 8 Telugu 8th Week Nominations (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 21, 2024, 5:27 PM IST

Bigg Boss 8 Telugu 8th Week Nominations:బిగ్‌బాస్ హౌజ్​లో మరోసారి నామినేషన్ల మంటలు మొదలయ్యాయి. ఏడో వారం నాగ మణికంఠ అలా ఎలిమినేట్​ కాగా.. 8వ వారం నామినేషన్స్​ను ఇలా మొదలుపెట్టాడు బిగ్​బాస్​. ఈసారి కూడా నామినేషన్ల ప్రక్రియ ఘాటుగానే జరిగినట్లు ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. అయితే ఇప్పటికే నామినేషన్స్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో లిస్ట్ లీకైపోయింది. మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎవరున్నారు? నామినేషన్స్ ప్రోమో విశేషాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఈ వారం నామినేషన్స్ థీమ్ కుండ పగలగొట్టడం. సీజన్ 7లోనూ ఈ తరహా నామినేషన్స్​ జరిగాయి. ఈ సీజన్​లోనూ అదే థీమ్ ఇచ్చాడు బిగ్‌బాస్. "ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ ఇంట్లో ఉండేందుకు అర్హత లేని ఇద్దరు సభ్యుల దిష్టి బొమ్మల మీద కుండలు పెట్టి.. తగిన కారణాలు చెప్పి వాటిని పగలగొట్టాల్సి ఉంటుంది" అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.

ఇక ప్రోమోలో చూపించిన విధంగా.. ముందుగా విష్ణుప్రియ.. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేసింది. "మణికంఠ విషయంలో అసలు నువ్వు (నిఖిల్) మెహబూబ్‌కి పాయింట్ ఇవ్వకుండా ఉండాల్సింది. కానీ ఇచ్చేశావు" అంటూ విష్ణు అంది. దీనికి "అలా అయితే మిగిలిన అమ్మాయిలు ఫుడ్ కూడా తినకుండా ఉన్నారు కదా.. మరి నువ్వు ఫుడ్ కోసం పాయింట్ ఇచ్చేశావ్ కదా" అంటూ నిఖిల్ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. "ఆ అంటే నేను ఒక పాయింట్‌యే ఇచ్చా" అని విష్ణు అంటే.. "మరి నేను కూడా ఒక పాయింట్‌యే ఇచ్చా. ఇంకేమీ వాడలే" అంటూ నిఖిల్ మరోసారి కౌంటర్ ఇచ్చాడు. ఇక ఫుడ్ విషయంలో ప్రేరణను నామినేట్ చేసింది విష్ణుప్రియ. దీనికి కూడా ప్రేరణ స్ట్రాంగ్ కౌంటర్ వేసింది.

బిగ్​బాస్​ 8: ఆరో వారం కిర్రాక్​ సీత అవుట్​ - రెమ్యునరేషన్​ వివరాలు లీక్​!

ఇక తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తూ "అసలు చెప్పిన రూల్స్ నువ్వు వినవ్.. సెల్ఫిష్‌గా ఆడతావ్" అంటూ రోహిణి చెప్పింది. దీనికి "నా స్ట్రాటజీ నా ఇష్టం" అంటూ వాదించాడు పృథ్వీ. దీంతో "నువ్వు విష్ణుతో ఉన్నప్పుడు, టాస్క్​, నామినేషన్స్‌లో తప్ప ఎక్కడా కనిపించవ్​" అంటూ రోహిణి అంది. ఇలా ఇద్దరి మధ్య కాసేపు డిస్కషన్​ జరగగా.. పృథ్వీ కుండను పగలగొట్టింది రోహిణి.

ఆ తర్వాత తన ఛాన్స్ వచ్చినప్పుడు రోహిణిని నామినేట్ చేశాడు పృథ్వీ. "మీరు ఆటలో జీరో అనిపిస్తుంది" అంటూ పృథ్వీ అన్నాడు. "అంటే నేను ప్రయత్నం చేయడం లేదా" అని రోహిణి అడిగింది. "ప్రయత్నిస్తున్నారు కానీ.. విన్ అవ్వడం లేదుగా" అంటూ పృథ్వీ అంటే.. "మరి నువ్వు ఒక్కసారి అయినా చీఫ్ అయ్యావా.. నీ దగ్గర ఆడే మేటర్, మాట్లాడే మేటర్ ఏం లేదు. కేవలం గొడవ పడాలి, నామినేట్​ చేయాలనే ఆలోచిస్తావు" అంటూ రోహిణి కౌంటర్ వేసింది. దీంతో "గేమ్స్ ఆడినప్పుడు రన్నింగ్ కూడా రావాలి కదా.. మీరనుకున్నంత ఈజీ కాదు పరిగెత్తడం" అని రోహిణిని పై నుంచి కిందకి చూశాడు పృథ్వీ. దీంతో "ఏంటి ఆ చూపేంటి.. నువ్వు నన్ను చూసిన విధానం కరెక్ట్ కాదు" అంటూ రోహిణి గొడవ చేసింది. దీంతో కొద్దిసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

వైరల్​ అవుతోన్న నామినేషన్స్ లిస్ట్ ఇదే: ఇక ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. దీంతో ఎవరెవరు ఈ వారం నామినేషన్స్ లిస్ట్‌లో ఉన్నారో చూద్దాం.

  • మెహబూబ్
  • పృథ్వీ
  • నయని
  • నిఖిల్
  • ప్రేరణ
  • విష్ణుప్రియ

ఈ ఆరుగురు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారని టాక్​. అయితే నిజానికి ఈ లిస్ట్‌లో హరితేజ కూడా ఉందట. కానీ నామినేషన్స్ పూర్తయ్యాక ఒకరిని సేవ్ చేసే అవకాశం రావడంతో ప్రైజ్ మనీలో ఏకంగా రూ.లక్ష ఖర్చుపెట్టి హరితేజను సేవ్ చేశారట రాయల్​ క్లాన్​ సభ్యులు.

మరో షాకిచ్చిన నాగ మణికంఠ - భార్య కంటే ఎన్నేళ్లు చిన్నోడో తెలుసా?

బిగ్​బాస్​ 8 : లవ్​ మ్యాటర్​ రివీల్​ చేసిన ​నబీల్ - పార్ట్​నర్​ ఆమేనటగా!

ABOUT THE AUTHOR

...view details