Bigg Boss 8 Second Day: బిగ్ బాస్ ఆట మొదలైపోయింది.. 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. గత సీజన్లకంటే భిన్నంగా.. ఈసారి నో కెప్టెన్.. నో రేషన్.. నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంటే రేషన్‌తో పాటు.. ప్రైజ్ మనీని సంపాదించుకుంటేనే వస్తుందని.. అన్ లిమిటెడ్ అంటూ బంపరాఫర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఆట మొదలైపోయింది. అంతేనా తొలిరోజే కంటెస్టెంట్ల మధ్య రచ్చ మొదలైంది. అందుకు సంబంధించి ప్రోమో కూడా వచ్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్(సెప్టెంబర్ 1)లో డైరెక్టర్ అనిల్ రావిపూడి వచ్చి ఒకరిని హౌజ్‌లో నుంచి బయటికి తీసుకుపోతున్నట్లు చెప్పారు. అయితే ఎవరిని బయటికి పంపించాలనుకుంటున్నారో కంటెస్టెంట్స్‌ను ఓట్లు వేయమని చెప్పగా.. ఆదిత్య ఓంతో పాటు.. నైనిక, బేబక్క, విష్ణు ప్రియ, సోనియా వీళ్లంతా.. నాగ మణికంఠను హౌస్‌లో నుంచి పంపించడానికి ఓట్లు వేశారు. దీంతో నాగ మణికంఠ ఎలిమినేట్ అయినట్లు అనిల్ రావిపూడి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. గేట్ దగ్గరికి తీసుకుచ్చి.. ఇది ఫేక్ ఎలిమినేషన్ అంటూ మళ్లీ ఇంట్లోకి తీసుకొచ్చాడు.
తాజాగా ప్రోమో మొదట్లో.. ఫేక్ ఎలిమినేషన్ గురించి నిఖిల్ అండ్ నాగమణికంఠ మధ్య జరిగిన డిస్కషన్ చూపించారు. దీంట్లో ఆదిత్య ఓంపై ఎటాకింగ్ ప్లే మొదలుపెట్టాడు నాగమణికంఠ. ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ ఫైర్ అయ్యాడు. "ఆయన బిహేవియర్‌లో తేడా ఉంది.. మాట్లాడే విధానంలో తేడా ఉంది. నేను అతన్ని లైక్ చేయను" అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మణికంఠ.
బిగ్‌బాస్ 8: హౌజ్‌లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ వీళ్లే - ఈసారి ఒక్కొక్కరు కాదు!
నువ్వా - నేనా: ఇక ఆ తర్వాత రెండో రోజు మార్నింగ్ ఎప్పటిలానే పాటతో మొదలుపెట్టారు. డ్యాన్సులు, స్విమ్మింగ్ పూల్‌లో జలకాలు.. స్టార్ట్ అయిపోయాయి. ఇక ఆ తర్వాత ఇంట్లోని కొందరు కంటెస్టెంట్స్ ఆరెంజ్‌లతో ఆట ఆడుకుంటున్నారు. దీంతో సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. ఈ క్రమంలో శేఖర్ బాషా.. బిగ్ బాస్ రూల్స్‌లో ఆరెంజ్‌లతో ఆడకూడదని రాశారా? అని క్వచ్చన్ రైజ్ చేశాడు.