తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్ బాస్ 8: అర్ధరాత్రి గంగవ్వకు గుండెపోటు - తీవ్రంగా భయపడ్డ కంటెస్టెంట్లు - అప్​డేట్​ ఇచ్చిన నిర్వాహకులు! - BIGG BOSS 8 GANGAVVA HEART ATTACK

-అర్ధరాత్రి గంగవ్వ హల్​చల్​ -ఏం జరిగిందో వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ టీమ్

Bigg Boss 8 Gangavva Heart Attack
Bigg Boss 8 Gangavva Heart Attack (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 4:10 PM IST

Bigg Boss 8 Gangavva Heart Attack:బిగ్​బాస్ తెలుగు సీజన్ 8లో షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఈ సీజన్​లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లలో గంగవ్వకు గుండెపోటు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది నిజమేనా? దీనిపై బిగ్​బాస్​ టీమ్​ ఎలా స్పందించింది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవించే గంగవ్వ ఓ యూట్యూబ్​ ఛానల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. 60 ఏళ్ల వయసులోనూ బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. నటన గురించి ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆమె మాట్లాడే యాస అందరికీ బాగా నచ్చుతుంది. తెలంగాణ కట్టు, బొట్టుతో గంగవ్వ బుల్లితెరపై పండించే కామెడీ మామూలుగా ఉండదు. అందుకే ఆమె పాపులారిటీ మెచ్చి తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో ‘బిగ్​బాస్’ సీజన్ 4 లో కంటెస్టెంట్​గా తీసుకున్నారు. అయితే ఆ సీజన్​లో కొన్ని వారాలే ఉన్న గంగవ్వ అనారోగ్య కారణాల దృష్ట్యా బయటికి వచ్చింది. తాజాగా సీజన్​8 లో వైల్డ్​ కార్డ్​ ద్వారా వచ్చి ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ క్రమంలోనే గంగవ్వకు హార్ట్​ ఎటాక్​ వచ్చిందన్న వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించి బిగ్​బాస్​ నిర్వాహకులు వీడియో కూడా రిలీజ్​ చేశారు. అందులో ఏముందంటే..

అందరూ పడుకున్న సమయంలో గంగవ్వ లివింగ్​ రూమ్​లోని సోఫా మీద కూర్చోని పెద్ద పెద్దగా అరుస్తూ దయ్యం పట్టినట్లుగా ఊగిపోయింది. దీంతో కంటెస్టెంట్లు ఒక్కొక్కరు హడావిడిగా వచ్చి గంగవ్వను చూసి హడలెత్తిపోయారు. ఏమైందో అని తెగ టెన్షన్​ పడిపోయారు. ముఖ్యంగా నయని పావని అయితే "స్టోర్​ రూమ్​ కెమెరా ప్లీజ్​ రెస్పాండ్"​ అంటూ ఆందోళన చెందింది. దగ్గరకు వచ్చిన రోహిణిని సైతం భయపెట్టింది గంగవ్వ. ఇక చివరగా చిన్నగా బెడ్​ రూమ్​లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు టేస్టీ తేజ, అవినాష్. ఇక అక్కడ ఉన్న లేడీ కంటెస్టెంట్లు ఎలా పడుకోవాలి అని భయపడ్డారు. తీరా సీన్​ కట్​ చేస్తే ఇది ప్రాంక్​ అయినట్లు వీడియోలో చెప్పారు. అంతకుముందు టేస్టీ తేజ, అవినాష్ గార్డెన్​ ఏరియాలో కూర్చోని" ఇంటి సభ్యుల మీద మేము ముగ్గురం ఘోస్ట్​ ప్రాంక్​ చేస్తున్నాం. ఇది నాకు, అవినాష్, గంగవ్వ ముగ్గురికి మాత్రమే తెలుసు" అంటూ టేస్టీ తేజ చెప్పాడు. అంతకుముందే ఘోస్ట్​లాగా ఎలా నటించాలో గంగవ్వకు టేస్టీ తేజ వివరించాడు. అయితే ఈ విషయం తెలియని హౌజ్​మేట్స్​ మాత్రం తెగ భయపడిపోయారు. మరి ఆ తర్వాత అన్నా ఈ విషయం తెలిసిందా లేదా అనేది ఇంకా చూపించలేదు.

వాడీవేడిగా నామినేషన్ల ప్రక్రియ - విష్ణు వర్సెస్​ ప్రేరణ - ఎనిమిదో వారం ఎంతమందంటే!

బిగ్​బాస్ 8: "ఇక ఆపేద్దాం" - విష్ణుప్రియ,​ పృథ్వీరాజ్​ బ్రేకప్​ - అర్ధరాత్రి ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details