తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బిగ్​బాస్​ 8 : హిస్టరీ రిపీట్​ కానుందా?- ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లేది ఆమేనా! - Bigg Boss First Week Elimination - BIGG BOSS FIRST WEEK ELIMINATION

Bigg Boss 8 Telugu First week Elimination : బిగ్​బాస్​.. ఈ పేరుకు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. అందుకే ఇన్ని సీజన్లు జరిగినా టాప్​ రేట్​లో దూసుకెళ్తోంది. తాజాగా సీజన్​ 8లో ఫస్ట్​ వీక్​ నామినేషన్స్​ జరిగాయి. ఇందులో ఆరుగురు నామినేట్​ అయ్యారు. మరి, ఫస్ట్​ వీక్​ ఎలిమినేషన్​ ఉందా? ఉంటే వారిలో ఎవరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లనున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

Bigg Boss 8 Telugu First week Elimination
Bigg Boss 8 Telugu First week Elimination (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 3:57 PM IST

Bigg Boss 8 First Week Elimination List:బిగ్​బాస్​ సీజన్​ 8లో మొత్తంగా 14 మంది హౌజ్​లోకి అడుగుపెట్టారు. ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు జంటలుగా కలిసి వెళ్లారు. ఇక ఫస్ట్​ వీక్​ నామినేషన్​లో ముగ్గురు చీఫ్​లు నిఖిల్​, నైనిక, యష్మీ మినహా మిగిలిన 11 మంది నామినేషన్​ ప్రక్రియలో పాల్గొనగా.. ఆరుగురు నామినేట్​ అయ్యారు. వారు.. విష్ణుప్రియ, సోనియా, పృథ్వీరాజ్​, శేఖర్​ బాషా, బేబక్క, నాగమణికంఠ.

ఓటింగ్​ చూస్తే:సాధారణంగా బిగ్​బాస్​ సీజన్​లో నామినేషన్స్​ ఎప్పుడూ సోమవారం రోజు స్టార్ట్​ అవుతాయి. కానీ ఈ సీజన్​లో మాత్రం మంగళవారం స్టార్ట్​ అయ్యి.. బుధవారం ఎండ్​ అయ్యాయి. అంటే మొత్తంగా రెండు రోజుల పాటు ఈ నామినేషన్స్​ జరిగాయి. దీంతో బుధవారం రాత్రి నుంచి ఓటింగ్​ లైన్స్​ ఓపెన్​ అయ్యాయి. అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు మూడు రోజుల పాటు ఓటింగ్స్​ జరిగాయి.

అన్​అఫీషియల్​ పోల్స్​ చూస్తే.. టాప్​లో ఇద్దరు కంటెస్టెంట్స్​ మధ్య ఫైట్​ ఉంది. సింపతీ స్టార్ట్​ అంటూ బీభత్సంగా ట్రోల్​ అవుతున్న నాగ మణికంఠ, యాంకర్​ విష్ణుప్రియ మధ్య టఫ్​ ఫైట్​ నడుస్తోంది. కొన్ని పోల్స్​లో విష్ణుప్రియ టాప్​లో ఉండగా.. మరికొన్ని పోల్స్​లో నాగమణికంఠ ఉన్నారు. ఏదేమైనా వీరిద్దరూ ఈ వారం సేవ్​ అవుతారు. ఇక ఆ తర్వాతి స్థానంలో పృథ్వీరాజ్​ ఉన్నారు.

"బిగ్‌బాస్‌కి రావడమే నేను చేసిన.." - హౌజ్​లో బరస్ట్​ అయిన విష్ణుప్రియ - ఏం జరిగిందో తెలుసా?

ఎవరూ ఊహించని కంటెస్టెంట్స్​: ఇక చివరి మూడు స్థానాల మధ్య పోటీ మాత్రం గట్టిగానే ఉంది. నాలుగో స్థానంలో బేబక్క ఉండగా, చివరి రెండు స్థానాల్లో సోనియా ఆకుల, శేఖర్​ బాషా ఉన్నారు. వీరి ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్​ అవుతారని సమాచారం. సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం ప్రకారరం చూస్తే.. బేబక్క ఎలిమినేషన్​ కానుందని టాక్​.

హిస్టరీ రిపీట్​ కానుందా? :సాధారణంగా గత అన్ని సీజన్లను చూస్తే.. ఫస్ట్​ వీక్​ ఎలిమినేషన్​లో కేవలం ఒకే వయసు ఉన్నవారిని ఎలిమినేట్​ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్‌ని వర్కౌట్ చేయబోతున్నారా అనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి ఏడో సీజన్ వరకూ చూస్తే.. తొలివారంలో ఎలిమినేట్ అయిన వాళ్లు.. బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్లే. సింగర్ కల్పన, నటి హేమా, కరాటే కళ్యాణి, షకీలా వీళ్లంతా ఇలా బయటకు వచ్చేసిన వాళ్లే. కాబట్టి బేబక్క ఎలిమినేషన్​ కన్ఫామ్​ అంటూ టాక్​ నడుస్తోంది.

ఎలిమినేషన్​ ఉంటుందా?: అయితే సీజన్​ 8లో ఫస్ట్​ వీక్​ ఎలిమినేషన్​ ఉండదనే ప్రచారం కూాడా సాగుతోంది. ఎందుకంటే ఓటింగ్​ లైన్స్​ కేవలం మూడు రోజులు మాత్రమే ఓపెన్​లో ఉండటం వల్ల కంటెస్టెంట్స్​ మధ్య టఫ్​ ఫైట్ ఉండే అవకాశం ఉంటుంది. ఒక్క పాయింట్​ తేడాతో కూడా​ ఎలిమినేషన్​ అయ్యే అవకాశం ఉండనుంది. కాబట్టి.. "నో ఎలిమినేషన్​ డే"గా ప్రకటించే అవకాశం కూడా ఉందని ప్రచారం సాగుతోంది. మరో వాదన ఏంటంటే.. గత సీజన్లలో మొదటి వారం ఎలిమినేషన్​ నిర్వహించలేదు.. కాబట్టి అదే ఆనవాయితీని ఈ సీజన్​లో కూడా కొనసాగిస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ వారం ఎవరూ ఎలిమినేట్​ కారు. మరి, ఏం జరుగుతుందో చూడాలి.

బిగ్​బాస్​ 8: కొంత గోల - కొన్ని కన్నీళ్లు - ఫస్ట్​ వీక్​ నామినేట్ అయింది వీళ్లే!

బిగ్​బాస్​​ 8: తొలిరోజే కంటెస్టెంట్స్​ మధ్య వార్​ - కెప్టెన్​ ప్లేస్​లో ముగ్గురు చీఫ్​లు! డే 1 హైలెట్స్​ ఇవే!

ABOUT THE AUTHOR

...view details