Bigboss Vasanthi Krishnan Marriage : ప్రస్తుతం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. చాలా మంది నటీ నటులు వరుసగా తమ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేసి పెళ్లి పీటలెక్కేస్తున్న సంగతి తెలిసిందే. అలా తాజాగా ఇప్పుడు మరో నటి, బిగ్ బాస్ వాసంతి కృష్ణన్ కూడా వివాహం చేసుకుంది.
ఈమె ప్రస్తుతం పలు ధారావాహికలతో పాటు చిత్రాల్లో నటిస్తోంది. కన్నడ చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. సిరిసిరి మువ్వలు సీరియల్‌తో టెలివిజన్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత గోరింటాక్, గుప్పెడంత మనసు వంటి ధారావాహికలతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరియల్స్‌తో తన నటనతో ఆకట్టుకుంది. కాలీఫ్లవర్, మనే నం.67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్(Bigboss Vasanthi Krishnan Movies)వంటి సినిమాల్లోనూ సహాయ పాత్రల్లో నటించి మెప్పించింది.
Bigboss Vasanthi Krishnan Relationship :ఈ క్రమంలో తన ఫ్యామిలీ ఫ్రెండ్ పవన్ కల్యాణ్‌తో ప్రేమలో పడింది. అయితే పవన్ కూడా నటుడేనని బయట కథనాలు ద్వారా తెలుస్తోంది. అతడు హీరోగా రెండు మూవీస్ చేస్తున్నాడని అందులో రాసి ఉంది. అయితే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు క్లారిటీ లేదు. గతేడాది ఈ జంట డిసెంబర్లో నిశ్చితార్థం చేసుకుంది. ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలోనూ పాల్గొని సందడి చేసింది. ఆ ఇంటర్వ్యూలో అందరి ముందే ఈ జంట ముద్దు పెట్టుకుని విమర్శకులను కూడా ఎదుర్కొంది.