Allu arjun About Pawan Kalyan : నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న సెలబ్రిటీ టాక్ షోకు పుష్ప రాజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ షోలో పవన్‌కల్యాణ్, ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు అల్లు అర్జున్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను ఆహా ఓటీటీ సంస్థ తాజాగా విడుదల చేసింది.
"అప్పటికి, ఇప్పటికి ప్రభాస్‌ను చూస్తే ఒక్కటే మాట చెప్పాలని ఉంటుంది. ఆరడుగుల బంగారం" అని బన్నీ అన్నారు. పవన్ కల్యాణ్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ 'తన దారిలో తను వెళ్లిపోతారు' అనగా, బన్నీ అంతే అంటూ సమాధానమిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇక ఇదే షోలో అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం గురించి కూడా మాట్లాడారు. తెలుగులో ఒక్కరికి కూడా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ రాకపోవడం తనని బాధించిందని, ఎలాగైనా సాధించాలనుకున్నానని పేర్కొన్నారు. అమ్మాయిల విషయంలో అన్యాయం జరిగితే తనకు బాగా కోపం వస్తుందని చెప్పారు బన్నీ. అయితే ఈ విషయాన్ని తాను ఇప్పటివరకూ ఎక్కడ బయటపెట్టలేదని చెప్పారు.
ఇంకా ఇదే షోలో అల్లు అర్జున్ తల్లి నిర్మల కూడా చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్నారు. చిన్నతనంలో బన్నీ ఏవిధంగా ఉండేవారు? ఆయన చేసిన అల్లరి పనులు వంటి అనే విషయాలను గుర్తు చేసుకున్నారు. మీరు కూడా దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి.