తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

NBK 109 బాలయ్యకు జోడీగా శ్రద్ధ? - బాలయ్య బాబీ సినిమా

Balakrishna NBK 109 Movie Heroine : బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK 109 సినిమాలో హీరోయిన్​గా శ్రద్ధా శ్రీనాథ్‌ కనిపించనుందని తెలిసింది. ఆ వివరాలు.

NBK 109 బాలయ్యకు జోడీగా శ్రద్ధ?
NBK 109 బాలయ్యకు జోడీగా శ్రద్ధ?

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 6:14 AM IST

Updated : Jan 31, 2024, 7:27 AM IST

Balakrishna NBK 109 Movie Heroine : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్​లో పెడుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఆయన తన తర్వాతి సినిమా పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK109తో వస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్​ బాబీ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్‌ ఓ కథానాయికగా కనిపించనుందని తెలిసింది. ఆమె రీసెంట్​గా ఈ చిత్ర సెట్స్‌లోకి అడుగు పెట్టినట్లు సమాచారం అందింది. ప్రస్తుతం ఈ మూవీ నైట్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బాలకృష్ణపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారని తెలిసింది.

1980ల బ్యాక్ డ్రాప్​ నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్, 'యానిమల్‌‌‌‌'తో మెప్పించిన బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. రీసెంట్​గా ఆయన ఈ మూవీ షూటింగ్‌‌‌‌లో జాయిన్ అయ్యారు. బాలయ్య - బాబీ దేఓల్​ మధ్య వచ్చే యాక్షన్‌‌‌‌ సీన్స్‌‌‌‌ పోటా పోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.

NBK 109 Release Date :ఇకపోతే ప్రస్తుతం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌‌‌‌గా చిత్రీకరణ జరుపుతున్న మేకర్స్ విడుదల తేదీ విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు దసరాకు రిలీజ్‌‌‌‌ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడీ చిత్రం మే లేదా జూన్‌‌‌‌ నెలలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు ఆ మధ్య బయట కథనాలు వచ్చాయి. నాగవంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, త్రివిక్రమ్​ ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇక ఈ చిత్రం పూర్తయ్యాక బాలయ్య - బోయపాటితో అఖండ 2, ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేసే అవకాశముందని ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

శర్వా కోసం ఇద్దరు భామలు - 'సిటాడెల్‌' అప్డేట్​తో సమంత

ఆసక్తిగా 'భామా కలాపం 2' టీజర్‌ - OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ రాక అప్పుడే

Last Updated : Jan 31, 2024, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details