Daku Maharaj Collections :నందమూరి నటసింహం బాలకృష్ణ 'డాకు మహారాజ్'తో థియేటర్లలో సందడి చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజైన ఈ సినిమా భారీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే భారీ స్థాయిలో వసూళ్లు అందుకున్న ఈ సినిమా, తాజాగా మరో మైలురాయి సాధించింది.
ఈ సినిమా రూ.100 కోట్ల మార్క్ దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. రిలీజైన 4 రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో వసూళ్లు రావడం వల్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'సంక్రాంతి బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్ 4 రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ.105 కోట్లు వసూల్ చేసింది' అంటూ మేకర్స్ ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా డాకు మహారాజ్ రూ.105 కోట్ల గ్రాస్ సాధించింది.
వరుసగా నాలుగు
కాగా, బాలయ్య కెరీర్లో వరుసగా నాలుగోసారి వంద కోట్ల మార్క్ అందుకున్నారు. ఇదివరకు 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాలు ఈ ఎలైక్ క్లబ్లో చేరాయి. అయితే ఈ అన్నింటికంటే డాకు మహారాజ్ కేవలం 4 రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు చేయడం విశేషం. దీనిపై బాలయ్య అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తమిళ్లో కూడా
తెలుగులో భారీ విజయం అందుకున్న డాకును తమిళంలోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. జనవరి 17న 'డాకు మహారాజ్' సినిమా తమిళంలోనూ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
డైరెక్టర్ బాబీ కొల్లి ఫుల్ మాస్ యాక్షన్ జానర్లో తెరక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశీ రౌతెలా స్పెషల్ సాంగ్‌లో బాలయ్యతో కలిసి ఆడిపాడారు. బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ దేఓల్ కీలక పాత్రలో కనిపించారు. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ రీసెంట్గా చెప్పారు.