తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

ETV Bharat / entertainment

మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య కామెంట్స్ - వారసుడు ఎప్పుడు రానున్నారంటే? - Balakrishna About Mokshagna Entry

Balakrishna About Mokshagna Entry : నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తన తండ్రి బాలకృష్ణ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.

Balakrishna About Mokshagna Entry
Balakrishna About Mokshagna Entry (ETV Bharat)

Balakrishna About Mokshagna Entry :నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి తన తండ్రి బాలకృష్ణ తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. రీసెంట్​గా ఐఫా అవార్డ్స్​కు హాజరైన బాలయ్య, తన తనయుడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"మీ వారసుడి సినిమా ఎప్పుడు మొదలు కానుంది ?" అంటూ యాంకర్ అడగ్గా, దానికి "మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్​లో లాంచ్ చేస్తున్నాం" అంటూ బాలయ్య రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. నందమూరి ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మొదటి అడుగు​ పడింది అక్కడే!
Balakrishna Cameo Role Mokshagna Movie : అయితే ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్, భారీ వీఎఫెక్స్ ఎఫెక్ట్స్​తో చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. వినోదాత్మక కథనంతో పురాణాలను టచ్ చేస్తూ దీన్ని తెరకెక్కించనున్నారని సమాచారం.

ఇక హీరోయిన్​గా కొత్త అమ్మాయిని తీసుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ మూవీలో బాలయ్య ఒక స్పెషల్ కేమియో రోల్​ చేయనున్నారని కూడా అంటున్నారు. అది కూడా శ్రీకృష్ణుడి గెటప్​లో క్లైమాక్స్​లో గూస్ బంప్స్ వచ్చే రేంజ్​లో కనిపిస్తారని టాక్ నడుస్తోంది.

వాస్తవానికి అన్​స్టాపబుల్​ షూటింగ్ సమయంలోనే ప్రశాంత్ వర్మ - బాలయ్య జర్నీ మొదలైంది. అన్​స్టాపబుల్​ కోసం ప్రశాంత్ వర్మ పని చేశారు. అప్పుడే బాలయ్యకు ప్రశాంత్ వర్మ ఓ లైన్​ను వినిపించారట! అది బాలయ్యను ఆకట్టుకుందట!. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ చిత్రం కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకోవడంతో బాలయ్య నమ్మకం మరింత రెట్టింపు అయింది. అందుకే ప్రశాంత్ వర్మకు బాలయ్య అవకాశాన్ని ఇచ్చారని తెలిసింది.

పైగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లాంఛ్​ కోసం బాలయ్య చాలా ఏళ్ల నుంచి ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ నందమూరి ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియుల్ని అలరించే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అప్పటికే స్టార్ వారసుల లాంఛ్ అంతా కమర్షియల్​ స్టోరీలతోనే అయింది. రామ్ చరణ్ చిరుత, మహేశ్​ బాబు రాజకుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని, ప్రభాస్ ఈశ్వర్ అన్నీ కమర్షియల్ ఫార్ములాతోనే రూపొందాయి. నాగ చైతన్య జోష్​ మెసేజ్ ఒరియెంటెడ్​గా తీసిన అంచనాలను అందుకోలేకపోయింది.

మోక్షుకు తారక్ స్పెషల్ విషెస్ - నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ! - Jr NTR Wishes Mokshagna

PVCUలోకి బాలయ్య వారసుడు- కిర్రాక్​గా మోక్షు ఫస్ట్ లుక్ - Mokshagna Teja Debut Movie

ABOUT THE AUTHOR

...view details