Badminton star Pv Sindhu Vijay Devarkonda Movies : మరోసారి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే తనకు క్రష్ అని చెప్పింది భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. ఆయన సినిమాలు ఎక్కువగా చూస్తానని చెప్పుకొచ్చింది. కానీ ఆయనతో మాట్లాడే అవకాశం ఇప్పటికీ రాలేదని తెలిపింది. అలానే రామ్‌చరణ్, ఎన్టీఆర్ కూడా తనకిష్టమైన యాక్టర్స్ అని చెప్పిన ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాలంటే తనకు ఎక్కువగా నచ్చవని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యాడ్మింటన్ వల్ల ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానిటి సినిమాలు బాగా చూస్తానని చెప్పింది. కొత్త పాత అనే తేడాలు ఏమీ లేకుండా అందరి మూవీస్‌ను చూస్తానని పేర్కొంది. అయితే ఫేవరేట్ హీరో ఎవరిని అడిగితే మాత్రం ఒక్క పేరు చెప్పడం కష్టమని వెల్లడించింది.
విజయ్ సినిమాలు నచ్చవు : విజయ్ దేవరకొండ సినిమాలు చాలానే చూశాను. అయితే అందులో కొన్ని నచ్చలేదు అని పీవీ సింధు చెప్పింది. అయితే నచ్చని సినిమాలు ఏంటన్నది రివీల్ చేయలేదు సింధు. ఓ సినిమా సెక్సెస్ అందుకుంటుందో లేదో తెలియకుండానే యాక్టర్స్ కష్టపడతారని, వాళ్ల కష్టాన్ని తక్కువ చేయకూడదని పేర్కొంది.
ఆమె అయితే ఓకే : ఇకపోతే గతంలో పీవీ సింధు సినిమాల్లోకి వస్తుందని ప్రచారం సాగింది. అయితే అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది సింధు. నటించాలనే ఆలోచన తనకు లేదని చెప్పింది. బ్యాడ్మింటన్‌పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించే సమయం తనకు లేదని తెలిపింది. భవిష్యత్తులో సినిమాల విషయంలో తన నిర్ణయం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేనని వెల్లడించింది. ఒకవేళ తన బయోపిక్ తెరకెక్కిస్తే అందులో బ్యాడ్మింటన్ తెలిసిన దీపికా పడుకొణె లాంటి హీరోయిన్ అయితే తనకు ఓకే అని కామెంట్స్ చేసింది.