తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

మాహిష్మతి మీద‌కి దండెత్తిన క‌ట్ట‌ప్ప‌ - 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్' స్ట్రీమింగ్ ఎక్కడంటే ? - Baahubali Crown Of Blood Release - BAAHUBALI CROWN OF BLOOD RELEASE

Baahubali Crown Of Blood : 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్'కు సంబంధించిన తాజా ట్రైలర్​ను మేకర్స్ విడుదల చేశారు. అంతే కాకుండా రిలీజ్ డేట్​ను కూడా వెల్లడించారు. ఆ విశేషాలు మీ కోసం

Baahubali Crown Of Blood
Baahubali Crown Of Blood

By ETV Bharat Telugu Team

Published : May 2, 2024, 4:45 PM IST

Baahubali Crown Of Blood :స్టార్ డైరెక్టర్ రాజ‌మౌళి తాజాగా 'బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్' అనే పేరుతో ఓ యానిమేటెడ్‌ సిరీస్​ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్​ ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. దీంతో పాటు దాని రిలీజ్​ డేట్​ను కూడా అనౌన్స్​ చేశారు. 'మాహిష్మతి రక్తంతో రాసిన కొత్త కథ' అంటూ విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం సినీ లవర్స్​ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

మే 17 నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్​ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుందట. ఇక ఈ సిరీస్‌లో 'బాహుబ‌లి'లో చూపించిన స్టోరీకంటే ముందు ఏం జరిగాయో ఆ విషయాన్ని చూపించనున్నట్లు వివరించారు. చూపింపిన స్టోరీకి ముందు చాలా విష‌యాలు జ‌రిగాయ‌ని వాటిని చూపించ‌బోతున్నార‌ని ట్రైల‌ర్ ద్వారా అర్థ‌మ‌వుతోంది.

రక్తదూత్ అనే రాజు ఆయుష్మతి సింహాసనానికి కట్టు బానిస అని చెప్పుకునే కట్టప్పను తన సేనాధిపతిగా నియమించుకొని మాహిష్మతి రాజ్యం మీదకు దండెత్తి వ‌స్తాడు. ఇక‌ సింహాసనం కోసం బాహుబలిని ఆ పదవి నుంచి ఎలా తప్పించాలా అనే తరుణం కోసం ఎదురుచూసే భల్లాలదేవ, త‌న సోద‌రుడు బాహుబలితో కలిసి రక్తదూత్​ను ఎదురిస్తాడా లేదా అన్న విషయాల గురించి సాగే ఆసక్తికరమైన కథాంశంతో ఈ యానిమేటెడ్ సిరీస్ తెర‌కెక్కిన‌ట్లుగా ట్రైలర్​ చూస్తే తెలుస్తోంది.

గతంలో ఓ సందర్భంలోనూ రాజమౌళి బాహుబలికి మూడో పార్ట్ ఉందని అన్నారు. ఇక అదే విషయం గురించి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. "తప్పకుండా బాహుబలికి మూడో భాగం ఉంటుంది. అందులో బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈ సారి మీకు చూపించనున్నాం. దీనికి సంబంధించిన వర్క్‌ చేస్తున్నాం. మా నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఈ విషయంపై సుముఖంగా ఉన్నారు. అయితే దీన్ని చూపించడానికి ఇంకాస్త కాస్త సమయం పట్టొచ్చు" అని అన్నారు. ఇది విన్న ఫ్యాన్స్​ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. త్వరగా ఆ సినిమా గురించి అప్డేట్ రావాలని ఆశిస్తున్నారు.

IMDB టాప్ రేటెడ్ సినిమాలు - ఎక్కడ స్ట్రీమ్ అవుతున్నాయంటే ? - IMDB Top movies In OTT

కొత్త బాహుబలి వచ్చేస్తోంది - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన జక్కన్న - RAJAMOULI BAAHUBALI

ABOUT THE AUTHOR

...view details