August Month OTT Movies : జులై ముగిసింది. ఆగస్ట్ నెల మొదలైంది. దీంతో మళ్లీ పలు క్రేజీ కొత్త సినిమా, సిరీస్‌లు స్ట్రీమింగ్‍కు రెడీ అయ్యాయి. ఇందులో హారర్, కామెడీ, రొమాంటిక్, యాక్షన్ అన్ని జానర్ సినిమాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.
ఆగస్ట్ మొదటి వారం
- హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్, అడ్వెంచర్ సినిమా 'డ్యూన్ 2'(జియోసినిమా) ఆగస్టు 1 నుంచి జియోసినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్ 'కింగ్‍డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్' ఆగస్టు 2 నుంచి డిస్నీ+ హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు కూడా తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'రక్షణ' ఆగస్టు 1వ తేదీనే ఆహాలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.
- స్టార్ హీరోయిన్ త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ 'బృంద' ఆగస్టు 2నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
- దిగ్గజ దర్శకుడు శంకర్ - లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వచ్చిన 'ఇండియన్ 2'(భారతీయుడు 2) ఆగస్టులోనే ఓటీటీలో రానుంది. నెట్‍ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకుంది. ఆగస్టు తొలి వారంలో ఇది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.సినిమాలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక భవానీ శంకర్, ఎస్‍జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రలు పోషించారు.
ఆగస్ట్ రెండో వారం
- తాప్సీ పన్ను, విక్రాంత్ మస్సీ, సన్నీ కౌశల్ నటించిన థ్రిల్లర్ మూవీ 'ఫిర్ ఆయి హసీన్ దిల్రూబా' నెట్ఫ్లిక్ వేదికగా ఆగస్ట్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది.
- సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్, ఖుషాలి కుమార్ కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'Ghudchadi'. తండ్రి కొడుకులు కలిసి ఓ తల్లి కూతురితో ప్రేమలో పడటమే ఈ సినిమా కథ. జియో సినిమాలో ఇది ఆగస్ట్ 9 నుంచి అందుబాటులో ఉండనుంది.
- మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, అంజనా జయ ప్రకాశ్, రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ కామెడీ 'టర్బో' ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. సోనీ లివ్‌లో ఆగస్ట్ 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఆగస్ట్ మూడో వారం
- రాఘవ్ జుయల్, కృతిక కర్మ, ధైర్య కర్వ కలిసి నటించిన మర్డర్ థ్రిల్లర్ 'గ్యారా గ్యారా' జీ5లో ఆగస్ట్ 9న విడుదల కానుంది. జీ5లో అందుబాటులో ఉండనుంది. 15 ఏళ్లుగా సాల్వ్ కానీ మర్డర్ కేసులను ఇద్దరు ఆఫీసర్స్ కలిసి ఎలా ఛేదించారన్నదే కథ.
- ప్రభాస్, అమితాబ్ కలిసి నటించిన 'కల్కి 2898 ఏడీ'(Kalki 2898 AD OTT Movie) రూ.1,100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతోంది. ఈ చిత్ర ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్, నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నాయి. ఈ సినిమా ఓటీటీలో ఆగస్టు 15న రావొచ్చని అంటున్నారు. లేదంటే మూడో వారంలో లేదా చివరి వారంలోనో అందుబాటులో ఉండొచ్చని కూడా చెబుతున్నారు.
- ఇంకా 9 మంది హీరోలు కలిసి నటించిన 'Manorathangal' జీ5లో ఆగస్ట్ 15న రానుంది. ఇందులో మ్మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్, మోహన్‌లాల్, బిజు మీనన్, కైలాశ్, జరీనా, ఇంద్రన్స్, నేదుముడి వేణు, ఎంజీ పనికర్, అపర్ణ బాలమురళి, సురభి లక్ష్మి, జాయ్ మాథ్యూ, ఇంద్రజిత్, హరీష్ ఉత్తమన్, శాంతికృష్ణ, ఆసిఫ్ అలీ, పార్వతి తిరువోతు, మధు వంటి వారు నటించారు.