Athiya Shetty KL Rahul Baby :జీవితంలోకి ఓ కొత్త వ్యక్తిని, బిడ్డని ఆహ్వానించడం చాలా ప్రత్యేకం. మరో కొత్త బంధం అడుగుపెట్టడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. త్వరలో టీమ్ఇండియా స్టార్ క్రికెటర్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి ఈ సంతోషాన్ని అనుభవించబోతున్నారు! ఈ వార్త బాలీవుడ్ స్టార్స్ మాధురీ దీక్షిత్, సునీల్ శెట్టి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న డ్యాన్స్ దీవానే సెట్స్‌లో హాస్యనటి భారతీ సింగ్, సునీల్ శెట్టి మధ్య సరదా సంభాషణతో బయటకు వచ్చింది.
'వచ్చే సీజన్‌లో తాతలాగా వేదికపై నడుస్తాను'
షోలో తాతయ్యల స్పెషల్ ఎపిసోడ్‌లో తాతయ్య అనే అంశం ప్రస్తావనకు వచ్చింది. భారతీ సింగ్ సరదాగా సునీల్ శెట్టికి తాతగారి గురించి కొన్ని లెసన్స్ చెప్పింది. అప్పుడు సునీల్ శెట్టి స్పందించారు. "అవును, నేను వచ్చే సీజన్‌లో తాతలాగా వేదికపై నడుస్తాను" అని చెప్పాడు. ఈ కన్వర్జేషన్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని క్రికెటర్ రాహుల్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ జంట త్వరలో మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోందనే వార్తలు వైరల్‌గా మారాయి.