Ashish Love me Movie Trailer :ప్రేక్షకుల్లో హారర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటోంది. తాజాగా ఓ రెండు హారర్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ భయపెడుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అవే మిరల్, లవ్ మీ చిత్రాలు.
- భయపెడుతున్న మిరల్
తమిళ నటుడు భరత్, ప్రేమిస్తే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని డబ్బింగ్ మూవీలలో కనిపించి మెప్పించాడు. చాలా కాలం తర్వాత హారర్, థ్రిల్లర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి భరత్ రెడీ అయ్యాడు. 2022లో తమిళ్‌లో రిలీజ్ అయిన మిరల్ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. శక్తివేల్ డైరెక్షన్‌లో భరత్, వాణి భోజన్ హీరో, హీరోయిన్లుగా నటించారు.
ఇప్పుడు మిరల్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది. రేపు మే 17న శుక్రవారం థియేటర్స్‌లోకి అడుగుపెడుతోంది. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సీహెచ్ సతీష్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. వన్ ఇన్సిడెంట్ కేన్ ఛేంజ్ యువర్ లైఫ్ అంటూ ట్రైలర్ ఆద్యంతం భయపెడుతోంది. ఓ మాస్క్ చుట్టూ కథ తిరుగుతూ ఆసక్తి కలిగిస్తోంది. ఆ మాస్క్ ఏంటి? హీరో కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
- థ్రిల్లింగ్‌గా అంచనాలు పెంచుతున్న లవ్ మీ
తాజాగా ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఆశిష్, వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన ఈ మూవీకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు. లవ్ మీ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. చేయవద్దన్న పని చేయడం, డేంజర్ ఉన్న చోటుకే వెళ్లడం హీరో మనస్తత్వమని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇందులో హీరో మనుషుల్ని చంపేసే దెయ్యంతో ప్రేమలో పడతాడు. మరి తనను ప్రేమించిన హీరోను దెయ్యం ఏం చేసింది? ఇంతకీ ఆ దెయ్యం కథేంటి? తెలియాలంటే మే 25 వరకు వెయిట్ చేయాల్సిందే.