తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆర్టికల్‌ 370' మూవీ- అన్నీ తెలిసే ఒప్పుకున్నా!: బాలీవుడ్ బ్యూటీ - Article 370 Director

Article 370 Yami Gautam : తానెప్పుడు కొత్త కథలను, భిన్నమైన కథనాలనే ఎంచుకునేందుకు ఇష్టపడతానని, అలాంటి ఒక కథే 'ఆర్టికల్‌ 370' అని బాలీవుడ్​ బ్యూటీ యామీ గౌతమ్‌ తెలిపారు. ఆర్టికల్‌ 370 గురించి అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశామని చెప్పారు ఈమె. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు పంచుకున్నారు యామి. అవి ఆమె మాటల్లోనే

Article 370 Yami Gautam
Article 370 Yami Gautam

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 8:13 AM IST

Updated : Feb 16, 2024, 8:57 AM IST

Article 370 Yami Gautam : వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఆర్టికల్‌ 370'. దర్శకుడు ఆదిత్య సుహాస్‌ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరోయిన్​ యామీ గౌతమ్‌ కీలక పాత్ర పోషించారు. ఈనెల 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ప్రమోషన్​ కార్యక్రమంలో పాల్గొన్న యామీ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్​ చేశారు.

'నచ్చింది-చేశాను'
'నేనెప్పుడు కొత్త కథలను, భిన్నమైన కథనాలను ఎంచుకునేందుకు ఇష్టపడతా. అలాంటి ఒక కథ ఇదే అనిపించింది. 'ఆర్టికల్‌ 370' గురించి అందరికీ తెలిసినప్పటికీ కూడా దాన్ని కొత్తగా చూపించాలని అనుకున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా చిత్రబృందం తీసిన ఒక సంపూర్ణమైన కథే ఈ చిత్రం. నేను చేయబోయే ఈ కథను ఎంతో దగ్గరగా చూశానని అనిపించింది. ప్రేక్షకుడి కోణంలో చదివాను. నచ్చింది. చేశాను' అని అన్నారు యామీ గౌతమ్​.

"కథను ఓకే చేసినప్పుడే ఎంతో సవాళ్లతో కూడుకున్న సినిమా అని అనుకున్నాను. శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఉంటాయని తెలిసినా కానీ నేను కనిపించే పాత్ర నన్ను ముందుకు నడిపించింది. ఈ సినిమా కోసం కొన్ని వారాల పాటు కఠోరమైన శిక్షణ కూడా తీసుకున్నా. పది అడుగులు వేయడానికి ముందు వేసే తొలి అడుగు ఎవరికైనా కష్టంగానే అనిపిస్తుంది. నా విషయంలో కూడా అదే జరిగింది. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా తర్వాత సరదాగా ఇష్టంగా చేశా."
- యామీ గౌతమ్​, కథానాయిక

'యాక్షన్‌ సినిమా మాత్రమే కాదు'
'ఈ చిత్రం కంటే ముందు నేను ఆదిత్య ధర్​తో కలిసి చేసిన తొలి సినిమా 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌'. ఈ రెండు సినిమాలు ఒకదానికొకటి పూర్తి భిన్నంగా ఉంటాయి. 'ఉరి' పూర్తిగా ఆర్మీ నేపథ్యం ఉన్న సినిమా. ఇప్పుడిది(ఆర్టికల్​ 370) ఎన్‌ఐఏ, పీఎంఓ, ఆర్మీ ఇలా మూడు బృందాలు కలిసి చేసిన సినిమా. ఇది కేవలం యాక్షన్‌ సినిమా మాత్రమే కాదు. అసలు 'ఆర్టికల్‌ 370' అంటే ఏమిటి? దాని వెనకున్న కథ? దానిని ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాం' అని యామీ గౌతమ్ చెప్పుకొచ్చారు.

'నా దృష్టిలో కథే హీరో'
నా దృష్టిలో కథే కీలకం. ఈ సినిమాలో కూడా కనిపించేవి పాత్రలు కాదు, పాత్రలను నడిపించే కథ. చిత్రానికి కథే హీరో. చరిత్రను తెలిపే 'ఆర్టికల్​ 370' కూడా అందులో భాగమే. అదే ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తిస్తుంది. అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. మరిన్ని రావాలని కోరుకుంటున్నాను.

ఎన్ని విమర్శలు వచ్చినా
'వాస్తవ సంఘటనల ఆధారంగా ఎన్నో సినిమాల వచ్చాయి. వాటిపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు అదే కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఆర్టికల్​ 370' చిత్రంపై కూడా అలాగే క్రిటిక్స్​ వస్తాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఒక విషయం పట్ల ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆలోచిస్తారు. కానీ దాని ముఖ్య ఉద్దేశం మాత్రం ఒక్కటే. విమర్శల నడుమ రిలీజైన ఎన్నో సినిమాలు బ్లాక్​బస్టర్​ హిట్​లను అందుకున్నాయి. మా సినిమాను అదే స్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని యామీ గౌతమ్ తెలిపారు.

'ఆర్​ఆర్​ఆర్​' సినిమాటోగ్రాఫర్ ఇంట విషాదం

జర్మనీకి ఐకాన్​ స్టార్ - ఆ సినిమా కోసం స్పెషల్ ట్రిప్!

Last Updated : Feb 16, 2024, 8:57 AM IST

ABOUT THE AUTHOR

...view details