AR Raham Lal Salaam :తన మ్యూజిక్‌తో ఎన్నో పాటలకు చక్కటి బాణీలను కట్టిన మ్యూజికల్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ తాజాగా మరో అద్భుతాన్ని సృష్టించారు. కృత్రిమ మేధస్సు (Artificial Intelligence)ను ఉపయోగించి మరణించిన ఇద్దరు గాయకుల గాత్రానికి ప్రాణం పోశారు. తన మ్యాజిక్‌తో ఆ గాత్రానికి చక్కటి సంగీతాన్ని అందించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కిస్తున్న 'లాల్ సలామ్' సినిమాలో 'తిమిరి ఎలుద' అనే పాట కోసం దివంగత సింగర్స్ బాంబ భక్య, షాహుల్ హమీద్‌ల వాయిన్సు ఉపయోగిస్తున్నట్లు ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"మేము ఆ ఇద్దరి వాయిస్ అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు వారి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి పర్మిషన్ తీసుకున్నాము. అంతే కాకుండా అలా ఉపయోగించుకున్నందుకు ఆ కుటుంబాలకు పారితోషకాన్ని కూడా అందించాము. సాంకేతికతను సరిగ్గా ఉపయోగిస్తే అది మనకు ముప్పు కలిగించదు. #Respect Nostalagia " అంటూ రెహమాన్ ట్విట్టర్లో వెల్లడించారు.
ఇది విన్న ఫ్యాన్స్ రెహమాన్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఏఐ ఉపయోగించి తమ ఫేవరట్ సింగర్స్ గాత్రాన్ని మరోసారి వినేలా చేసినందుకు రెహమాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాంబ భక్య 2022లో మరణించగా, షాహుల్ 1997లో తుది శ్వాస విడిచారు.