AP Elections 2024 Pawan Kalyan Renudesai : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదలైయ్యాయి. జనసేన పార్టీ తాము ఊహించినట్లుగానే ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో పార్టీ వర్గాల్లో సంబరాలు మిన్నంటాయి. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కూడా 69వేల పైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ విజయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన అభిమానులతో పాటు పవన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ విజయంపై పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా స్పందించారు. "ఆద్య, అకీరాలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నా" అంటూ క్యాప్షన్ పెడుతూ ఆద్య ఆనందంగా ఉన్న ఫొటోలను పోస్టు చేశారు. ఈ విజయం తన కొడుకు, కూతురికి చాలా సంతోషాన్నిస్తుందని వెల్లడించారు. కానీ, ప్రత్యేకించి వాళ్లకే ఆనందంగా ఉందని చెప్పడంలో తనకు ఏ మాత్రం సంతోషం లేదని చెప్పారా అంటూ నెటిజన్లు కొంతమంది సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan Janasena :కాగా, జనసేన,తేదేపా, బీజేపీ కలిసి ఏర్పడిన కూటమికే ప్రజలు మొగ్గు చూపడంతో భారీ మెజారిటీ దక్కింది. అటు తేదేపా కార్యకర్తలతో పాటు జనసేన కార్యకర్తలు గెలుపు సంబరాలు చేసుకుంటూ హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. వారందరికీ పవన్ భార్య అన్నాలెజినోవా, కుమారుడు అకీరాలు ధన్యవాదాలు తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇకపోతే గతేడాది పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. కేవలం ఒకే ఒక్క సీటులో మాత్రమే విజయం దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సారి మాత్రం ఒంటరిగా పోటీ చేసి రిస్క్ చేయకుండా ఎన్డీఏతో కూటమితో కలిసింది. ఘన విజయాన్ని దక్కించుకుంది. విపక్షాలన్ని ప్రత్యేక వ్యూహ రచనతో బరిలోకి దిగి వైసీపీకి ఘోర పరాజయాన్ని అప్పగించాయి. కొత్త ప్రభుత్వం జూన్ 9న కొలువుదీరనుందని తెలిసింది.
పవన్ కల్యాణ్ విజయంపై స్పందించిన రేణూ దేశాయ్ - Pawankalyan Renudesai - PAWANKALYAN RENUDESAI
AP Elections 2024 Pawan Kalyan Renudesai : 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన సాధించిన విజయాన్ని జనసైనికులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీనిపై సెలబ్రిటీలు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. అలానే రేణూ దేశాయ్ కూడా దీనిపై స్పందించారు.
Pawan Renudesai (Source ETV Bharat)
Published : Jun 4, 2024, 5:04 PM IST