తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

ఆమిర్ ఖాన్ మాజీ భార్యకు సందీప్​ వంగా కౌంటర్​ - సందీప్ రెడ్డి వంగా ఆమిర్ ఖాన్

Animal Director Sandeep Reddy Vanga Kiran Rao : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్​ మాజీ భార్య కిరణ్​ రావుకు రివర్స్ కౌంటర్ వేశారు యానిమల్ డైరెక్టర్​ సందీప్ వంగా. ఆ వివరాలు.

ఆమిర్ ఖాన్ మాజీ భార్యకు సందీప్​ వంగా కౌంటర్​
ఆమిర్ ఖాన్ మాజీ భార్యకు సందీప్​ వంగా కౌంటర్​

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 6:42 AM IST

Updated : Feb 3, 2024, 8:00 AM IST

Animal Director Sandeep Reddy Vanga Kiran Rao : రీసెంట్​గా 'యానిమల్‌' చిత్రంతో భారీ హిట్‌ అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం నెట్‌ప్లిక్స్‌లో టాప్ ట్రెండింగ్​లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత కొన్ని విమర్శలను ఎదర్కొంది. స్త్రీ విద్వేష చిత్రం అంటూ చాలా మంది సెలబ్రిటీలు కూడా కామెంట్లు చేశారు. అలానే ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు కూడా ఇలాంటి విమర్శలే చేసింది. బాహుబలి-2, కబీర్ సింగ్ చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె ఆరోపించారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్పందించారు. తనదైన శైలిలో ఆ విమర్శలకు సమాధానమిచ్చారు. ఆమె పేరును ప్రస్తావించకుండానే కాస్త చురకలంటించేలా మాట్లాడారు. "నేను ఓ కథనాన్ని చదివాను. ఇందులో ఓ సూపర్ స్టార్ మాజీ భార్య బాహుబలి 2, కబీర్ సింగ్ చిత్రాలు చిత్రాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పింది. ఆమెకు సరైన అవగాహన లేదనుకుంటాను. నేను ఆమెకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు అమీర్ ఖాన్‌ను వెళ్లి అడగండి. ఆయన నటించిన దిల్ సినిమా విషయానికొస్తే దాదాపు అమ్మాయిపై రేప్‌కు ప్రయత్నించే పరిస్థితిని సినిమాలో సృష్టించారు. కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తారు. చివరికి అతనితోనే ఆమె ప్రేమలో పడుతుంది. మరీ ఇదంతా ఏంటి? ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై ఎలా విమర్శలు చేస్తారో అర్థం కావడం లేదు" అని యానిమల్ డైరెక్టర్​ సందీప్ వంగా కౌంటర్ వేశారు​.

ఇక 'యానిమల్' సినిమాలో అనిల్ కపూర్, బాబీ దేఓల్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ఫాదర్ అండ్ సన్ రిలేషన్​షిప్​నేపథ్యంలో సినిమా తెరకెక్కింది.

'కన్నప్ప' టార్గెట్ ఫిక్స్!- థియేటర్లకు వచ్చేది అప్పుడే

'హనుమాన్' సునామీ- 92 ఏళ్లలో ఆల్​టైమ్​ బ్లాక్​బస్టర్​గా రికార్డ్!

Last Updated : Feb 3, 2024, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details