తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

యాంకర్ సుమ ఫన్నీ డ్యాన్స్​ - చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టమే! - Anchor Suma Dance Video - ANCHOR SUMA DANCE VIDEO

Anchor Suma Dance Video : బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు స్టార్ యాంకర్​గా రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో పుల్​ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది. తాజాగా ఓ ఫన్నీ డ్యాన్స్ వీడియోను షేర్ చేసి తెగ నవ్వించేసింది.

యాంకర్ సుమ ఫన్నీ డ్యాన్స్​ - చూస్తే నవ్వాపుకోలేరంటే
యాంకర్ సుమ ఫన్నీ డ్యాన్స్​ - చూస్తే నవ్వాపుకోలేరంటే

By ETV Bharat Telugu Team

Published : Apr 8, 2024, 8:54 AM IST

Updated : Apr 8, 2024, 9:28 AM IST

Anchor Suma Dance Video :బుల్లితెర యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓ వైపు స్టార్ యాంకర్​గా రాణిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో పుల్​ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక ఫన్నీ రీల్‌తో నవ్వించే ప్రయత్నం చేస్తుంటుంది. తాజాగా ఓ ఫన్నీ డ్యాన్స్ వీడియోను షేర్ చేసి తెగ నవ్వించేసింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రభుదేవా లేటెస్ట్ రీల్ వీడియో ఒకటి బాగా ట్రెండ్ అవుతున్న సంగతి చాలా మంది యూజర్స్​కు తెలిసే ఉంటుంది. ఆ రీల్‌ను రీ క్రియేట్ చేయాలని సుమ అండ్ టీమ్ ట్రై చేసింది. అయితే వీరంతా నాన్ సింక్​లో చేశారు. దీంతో ఆ వీడియోకు అన్ ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ 2.ఓ అన్నట్టుగా క్యాప్షన్ జోడించి ఈ రీల్ వీడియోను షేర్ చేసింది సుమ. ప్రస్తుతం ఇది నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు ఢీ షోలో జాయిన్ చేయండి, సుమక్క ఇంత బాగా చేస్తావ్ అస్సలు ఊహించలేదే అంటూ పగలబడి నవ్వేసుకుంటున్నారు. ఇదేం నాన్ సింక్ డ్యాన్స్ రా బాబు అంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. అలా మొత్తానికి సుమ తన ఫన్నీ డ్యాన్స్ రీల్ వీడియోతో అందరినీ కాసేపు తెగ నవ్వించేసింది.

కాగా, సుమ ఎప్పటిలగాగే ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, యూట్యూబ్ వీడియోలు, ఈవెంట్లు, ఇన్ స్టా రీల్స్ అంటూ బిజీగానే ఉంటోంది. అలాగే బుల్లితెరపై షోలు కూడా చేస్తోంది.అయితే ఆ మధ్యలో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. జయమ్మ పంచాయితీ సినిమా థియేటర్లలో సందడి చేసింది. కానీ అది అంతగా సక్సెస్ కాకపోవడంతో మళ్లీ బుల్లితెరపైనే జోష్ కొనసాగిస్తూ ముందుకెళ్తోంది.

Anchor Suma Son Movies : ఇకపోతే రీసెంట్​గా సుమ తనయుడు రోషన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చైల్డ్ ఆర్టిస్ట్​గా ఒకప్పుడు కనిపించిన ఇతడు బబుల్ గమ్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. న్యూ ఏజ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా యూత్​ను బాగానే ఆకట్టుకుంది.

బర్త్​డే బాయ్ బన్నీ ఫిట్​నెస్, డైట్​ సీక్రెట్​ ఇదే - Happy Birthday Allu Arjun

బన్నీకి మాత్రమే సాధ్యమైన రికార్డులివే - అన్నింటిలోనూ నెం.1! - HAPPY BIRTHDAY ALLUARJUN

Last Updated : Apr 8, 2024, 9:28 AM IST

ABOUT THE AUTHOR

...view details