తెలంగాణ

telangana

అనంత్-రాధిక వెడ్డింగ్​లో హీరో యశ్​ కొత్త లుక్​ - సోషల్ మీడియా షేక్​! - KGF Yash Stylish Look

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 4:05 PM IST

Anant Ambani Radhika Merchant Wedding KGF Yash Look : అనంత్-రాధిక వివాహ వేడుకకు హాజరైన రాకింగ్ స్టార్ హీరో యశ్ కొత్త లుక్​ వైరల్​గా మారింది. మీరు చూశారా?

source Getty Images
Anant Ambani Radhika Merchant Wedding KGF Yash Look (source Getty Images)

Anant Ambani Radhika Merchant Wedding KGF Yash Look : అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన అనంత్-రాధిక వివాహ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలంతా హాజరై సందడి చేస్తున్నారు. వీరిలో కేజీయఫ్ భాయ్​, రాకింగ్ స్టార్ యశ్ కూడా ఉన్నారు. తాజాగా ఆయన పెళ్లి వేడుకకు హాజరైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

ఇందులో యశ్ కారులో నుంచి దిగి తన ఫ్యాన్స్​కు అభివాదం తెలిపారు. ముఖ్యంగా ఆయన లుక్​ అందరి దృష్టిని ఆకర్షించింది. యమ స్టైలిష్​గా బియర్డ్​ లుక్​లో పెద్ద కోరా మీసాలతో కనిపించారు. లాంగ్ హెయిర్​లోనే సైడ్​ లైట్​గా ట్రిమ్​ చేసి కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా సెన్సేషన్​గా మారింది.​ ఈ వీడియో చూసిన అభిమానులు యశ్ స్టైలిష్ ఎంట్రీకి ఫిదా అయిపోతున్నారు. రావణ, డ్యాషింగ్​ లుక్​, బియర్డ్ అదిరింది అంటూ ఫైర్ ఎమోజీలతో కామెంట్లు చేస్తూ వీడియో, ఫొటోస్​ను తెగ షేర్ చేస్తున్నారు.

కాగా, KGF చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్​లో స్టార్ డమ్ సంపాదించుకున్నారు యశ్. ఆ సినిమాలతో కన్నడ సినీ పరిశ్రమ స్థాయి కూడా భారీగా పెరిగింది. దీంతో యశ్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆయన మాత్రం చాలా గ్యాప్​ ఇచ్చి రీసెంట్​గా మలయాళీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్​కు గ్నీన్ సిగ్నల్ ఇచ్చారు. టాక్సిక్ పేరుతో సినిమాను అనౌన్స్​ చేశారు. ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అన్నది ఉపశీర్షిక. కొద్ది కాలం క్రితమే మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఈ సినిమాను కూడా కేజీయఫ్ లాగా రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌, కియారా అడ్వాణీ, శ్రుతి హాసన్‌లను పరిశీలిస్తున్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో కె.వి.ఎన్‌. ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. యాక్షన్‌ ప్రియులను అలరించే కథాంశంతో ఇది సిద్ధమవుతోన్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్‌ 10న సినిమా రిలీజ్ కానుంది.

1000 కత్తుల పదునుతో సేనాపతి - కమల్, కాజల్​ మధ్య కత్తి యుద్ధం - Indian 3 trailer

ఈ పాట పాడింది దిల్​రాజునే అని మీకు తెలుసా? - Dil Raju Sing Song

ABOUT THE AUTHOR

...view details