Pawankalyan Anand O Manchi Coffee Movie : ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ను దృష్టిలో పెట్టుకుని ఆయా దర్శక, రచయితలు కథను సిద్ధం చేసుకుంటుంటారు. కొన్ని సార్లు మాత్రమే కథను రాశాక తర్వాత హీరో, హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తుంటారు. అలానే ఆయా హీరోలను దృష్టిలో పెట్టుకుని కథను రాశాకా, ఆ సినిమాల్లో మరో హీరో నటించడం వంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అవి ఊహించని విజయాన్ని అందుకుంటాయి. మరికొన్ని పరాజయాన్ని అందుకుంటాయి. అలా వచ్చిన చిత్రమే ఆనంద్ మంచి కాఫీలాంటి సినిమా. వాస్తవానికి ఇందులో హీరో పవన్ కల్యాణ్ కోసం రాసిన కథ. అవును మీరు చదివింది నిజం. మరి పవన్ ఇందులో ఎందుకు నటించలేదో తెలుసా?
అప్పట్లో చదువు పూర్తి కాగానే ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన శేఖర్ కమ్ముల తర్వాత సినిమాలపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి వచ్చేశారు. ఫిల్మ్ మేకింగ్ కోర్సులో చేరారు. ఆ తర్వాత డాలర్ డ్రీమ్స్ తీయగా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా శేఖర్‌కు జాతీయ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆనంద్ కథను రాసుకున్నారు. పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేశారట. కానీ ఆయన్ను సంప్రదించలేకపోయారట. ఈ విషయాన్ని శేఖరే ఓ సందర్భంలో చెప్పారు. అయితే ఎందుకు కలవలేదో అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు.
అలా పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న కథలో రాజా హీరోగా నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. హీరోయిన్గా ముందుగా అసిన్, సదాను అనుకున్నప్పటికీ చివరకు ఆ అవకాశం కమలినీ ముఖర్జీ దక్కించుకుంది మంచి పేరు సంపాదించుకుంది.