Ambajipeta Marriage Band Suhas :టాలీవుడ్ నటుడు సుహాస్ 'కలర్ ఫొటో' సినిమాతో హీరోగా పరిచయమై 'రైటర్ పద్మభూషణ్'తో మరో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. లేటెస్ట్గా 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'తో కెరీర్లో తొలి హ్యాట్రిక్ కొట్టారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో తనను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు హీరో సుహాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.
'అందరికి నమస్కారం, మేం అనుకున్నట్లుగానే 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' సినిమాను ప్రేమతో ఆదరిస్తున్న అందరికీ థాంక్స్. యూట్యూబ్‌లో నా షార్ట్ ఫిల్మ్స్ కి కామెంట్స్ పెట్టడం నుంచి ఇవాళ బుక్ మై షోలో టికెట్లు కొనే వరకు నన్ను ప్రేమతో నడిపిస్తున్నారు. ఈ ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను' అని అన్నారు. ప్రస్తుతం సుహాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి సినిమాలతోపాటు సందీప్‌రెడ్డి బండ్ల- దిల్‌రాజు కాంబోలో ఓ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఇక ప్రసన్న వదనం సినిమా వచ్చే నెలలో థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Ambajipeta Marriage Band Collection: ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యింది. ఇక తొలి వారంలో వరల్డ్‌వైడ్‌గా రూ.11.7 కోట్లు వసూల్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అటు ఓవర్సీస్లోనూ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు అదరగొడుతోంది. ఇప్పటికే ఓవర్సీస్లో 200K డాలర్ల మార్క్ క్రాస్ చేసింది.