Pushpa 2 Shooting Update Rashmika : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పుష్ప రూల్‌కు సమయం దగ్గరవుతోంది. మరో రోజుల్లో 22 రోజుల్లో పుష్ప ది రూల్ ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా రానుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 చిత్రీకరణకు సంబంధించి హీరోయిన్ రష్మిక ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్ ఆద్యంతం ఎంతో సరదా జరిగిందని చెప్పారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పనులు (Pushpa 2 Dubbing) జరుగుతున్నాయని అన్నారు. డబ్బింగ్ స్టూడియోలో తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
"ఫన్, గేమ్స్ పూర్తైపోయ్యాయి. పనిలో బిజీ అయ్యాను! పుష్ప ది రూల్ షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయింది. ఫస్టాఫ్ డబ్బింగ్ పనులు కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు సెకండాఫ్ కోసం డబ్బింగ్ చెబుతున్నాను. ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. సెకండాఫ్ అంతకు మించి ఉంటుంది. మాటల్లో చెప్పలేను. మీరు కచ్చితంగా మైండ్ బ్లోయింగ్ అనుభూతిని పొందుతారు. ఈ చిత్రాన్ని మీకు చూపించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. చిత్రీకరణ పూర్తి అవుతున్నందుకు బాధగా ఉంది" అని రష్మిక చెప్పారు.