తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

బన్నీ లైఫ్​ను మార్చేసిన ఆ తేదీ - అసలా రోజు ఏం జరిగిందంటే? - ALLUARJUN - ALLUARJUN

Allu arjun Latest Post : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ తాజాగా ఎమోషనల్ పోస్ట్​ చేశారు. ఆ తేదీ తన జీవితాన్నే మార్చేసిందని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
Allu arjun (Source ANI)

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 12:56 PM IST

Allu arjun Latest Post :20 ఏళ్ల క్రితం అల్లు అర్జున్ కెరీర్​లో ఒక అద్భుతం జరిగింది. ఆయన్ను ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా పుష్పగా మనముందు ఉంచింది. అదే వన్​ సైడ్ లవ్​ అంటూ తెలుగు యువతలో క్రేజ్ పెంచిన ఆర్య మూవీ. అప్పటివరకు వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ సినిమాల్లో ఉన్నా ఈ చిత్రంతో ఆ కాన్సెప్ట్​కు మరింత ప్రాముఖ్యత ఏర్పడింది.

Arya 20 Years Completed :ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ తాజాగా అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో ఆర్య సినిమా రోజులను గుర్తుచేసుకుంటున్నట్టు ఒక పోస్ట్ పెట్టారు. ఆర్య రీలీజ్ డేట్ మాత్రమే కాదని తన జీవితాన్ని మార్చిన రోజు అని పేర్కొన్నారు. ఆ విషయంలో ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటానని ఆ పోస్టులో రాసుకొచ్చారు.. అంతేకాకుండా ఆర్య మూవీ షూటింగ్ జరిగినప్పుడు తీసిన కొన్ని ఫోటోలను కూడా ఆ పోస్ట్​తో పాటు షేర్ చేశారు. అలానే ఆర్య చిత్ర దర్శకుడు సుకుమార్ కూడా చాలా సందర్భాల్లో ఈ సినిమా హిట్​కు కారణం అల్లు అర్జున్ అని ప్రశంసించారు. ఈ చిత్ర విజయమే తన కెరీర్​ను మలుపు తిప్పిందని చెప్పుకొచ్చారు.

ఆర్య మూవీటీమ్ రీయూనియన్​ - ఆర్య మూవీ టీమ్ రీ యూనియన్ ఈ రోజు సాయంత్రం జరగనుందని సమాచారం. ఈ మీట్ అప్​లో అల్లు అర్జున్, సుకుమార్​తో పాటు దిల్ రాజు కూడా పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్​గా నటించిన అను మెహతా తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైంది. మరి ఈ రీ యూనియన్​కు ఆమెకు ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ఇకపోతే అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో 2021లో వచ్చిన పుష్ప కూడా పాన్ ఇండియా హిట్ అయింది. ఇప్పుడు పుష్ప 2 కోసం వీరిద్దరు కలిసి పనిచేస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా విపరీతతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో అల్లు అర్జున్​తో పాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details