Pushpa 2 Interesting Facts :ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప ట్రెండ్ నడుస్తోంది. ఇక ట్రైలర్లో చూపిన పలు సన్నివేశాలు, డైలాగులతో సినిమాపై హైప్ పెరిగిపోయింది. అయితే సినిమాలోని గంగమ్మ జాతర ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో తొలి నుంచి ఆసక్తి నెలకొంది.
తాజాగా ట్రైలర్లో కూడా జాతర ఎపిసోడ్‌కు సంబంధించి ఒకట్రెండు షాట్స్ చూపించారు. అందులో కన్నడ నటుడు తారక్ పొన్నప్పను అరగుండుతో చూపించి ఒక్కసారిగా అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు. మెడలో చెప్పుల దండ, అరగుండుతో పొన్నప్ప డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. కాగా, ఈ జాతర సీన్‌పై కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు.
గంగమ్మ జాతర సీన్‌పై మేకర్స్ ఎంతో కేరింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా కొరియోగ్రాఫర్ మాట్లాడారు. జాతర ఎపిసోడ్ షూటింగ్లో దాదాపు 2000మంది జూనియర్లు, 200మంది డ్యాన్సర్లు పాల్గొన్నట్లు విజయ్ పొలాకి పేర్కొన్నారు. ఇక ఈ గంగమ్మ జాతర సీక్వెన్స్ కోసం 30రోజులకు పైగానే పట్టిందట. స్పెషల్ మేకప్, లైటింగ్ సెటప్స్, ఆర్ట్ వర్క్, మోకోబాట్ కెమెరాతో షూట్ చేసినట్లు తెలిసింది. ఓవరాల్‌గా ఈ ఒక్క ఎపిసోడ్‌కు రూ.50 నుంచి 60 కోట్ల దాకా ఖర్చైనట్లు సమాచారం.