తెలంగాణ

telangana

'లవ్ యూ మై డియర్ ఆర్మీ- మిమ్మల్ని చూసే హీరో అయ్యా' - ALLU ARJUN Pushpa

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 10:48 PM IST

Allu Arjun Pushpa 2: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ గురువారం 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్నారు. ఈ ఈవెెంట్​లో ఆయన పుష్ప గురించి మాట్లాడి ఫ్యాన్స్​లో జోష్ నింపారు.

Allu Arjun Pushpa 2
Allu Arjun Pushpa 2 (Source: ETV Bharat)

Allu Arjun Pushpa 2:ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప- 2' క్లైమాక్స్​ షూటింగ్​లో బిజీగా ఉన్నారు. అయితే ఆ షూటింగ్​కు కాస్త బ్రేక్ ఇచ్చి బన్ని గురువారం ఫ్యాన్స్​కు ట్రీట్ ఇచ్చారు. డైరెక్టర్ సుకుమార్​తో కలిసి ఆయన 'మారుతి నగర్ సుబ్రమణ్యం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​కు చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ ఈవెంట్​లో బన్ని ఫ్యాన్స్​లో ఫుల్ జోష్ నింపుతూ పుష్ప సినిమా గురించి మాట్లాడారు.

ఫ్యాన్స్ లవ్​ యూ
అభిమానులంటే ఆయనకు ఎంతో ఇష్టం అని బన్ని చెప్పారు. అందరూ హీరోని చూసి ఫ్యాన్స్ అవుతుంటే, ఆయన మాత్రం ఫ్యాన్స్​ను చూసి హీరో అయ్యారని అన్నారు. 'నా ఫ్యాన్స్, నా ఆర్మీ ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ నా ఫ్యాన్స్​ అంటే నాకు పిచ్చి అబ్బా. నేను ఎప్పుడూ అంటున్నాను. అందరూ హీరోను చూసి ఫ్యాన్స్ అవుతుంటారు. కానీ, నేను నా ఫ్యాన్స్​ను చూసి హీరో అయ్యాను. థ్యాంక్యూ సినిమా వచ్చి మూడేళ్లు దాటింది. ఇంకోసారి ఇలా ఇబ్బంది పెట్టను. తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తా, ఇంకెక్కువ కనబడతా' అని నవ్వుతూ అన్నారు.

అస్సలు తగ్గేదేలే
'సాధారణంగా ఏదైనా సినిమా గురించి చెప్పాలంటే నేను భయపడతాను. సినిమా ఎలా ఉంది అనేది ప్రేక్షకులు చెప్పాల్సిన విషయం. అది నేను చెబితే డబ్బా కొట్టినట్లు ఉంటుంది. అందుకే సినిమా గురించి చెప్పాలంటే భయపడతా. కానీ, ఈ సినిమా (పుష్ప 2) వస్తున్న విధానం, మీ అందరికీ నచ్చుతుంది. ఎక్కువ చెప్పను. అదీ ఇదీ కాదు. డిసెంబర్ 6న అస్సలు తగ్గేదేలే. ఈ మాట నా ఫ్యాన్స్​కు మాత్రమే చెబుతున్నా' అని పుష్ప 2 గురించి ఫ్యాన్స్​లో జోష్ నింపారు.

ABOUT THE AUTHOR

...view details