Allari Naresh Bachhala Malli Movie :కామెడీ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అల్లరి నరేశ్, ఆ తర్వాత సీరియస్ రోల్స్‌లోనూ నటించి అభిమానులను మెప్పించారు. పాత్ర ఏదైనా సరే అందులో లీనమైపోయి నటిస్తూ అలరింతే ఈ స్టార్ హీరో ఇప్పుడు ఫుల్ ఆన్ మాస్ రోల్‌తో ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోయారు. 'బచ్చల మల్లీ' అనే సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ హీరో ఫస్ట్ లుక్కు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
పేరు: మళ్ళీ, ఇంటిపేరు : బచ్చల, చేసేది : ట్రాక్టర్ డ్రైవెర్. "ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా రోజులు గుర్తుండిపోతారు". అంటూ హీరో ఇంట్రడక్షన్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో నరేశ్ ఒక లోకల్ రౌడీ పాత్ర పోషించనున్నారు. అందుకోసమే ఈ కథకు తగ్గట్టుగా నరేశ్ గడ్డం పెంచుకుని, మెడలో తాయెత్తు, చేతికి కాశీ దారం ఇలా ఫుల్ మాస్ లుక్‌లో కనిపించారు. అంతేకాకుండా ఓ రిక్షా మీద కూర్చొని బీడీ తాగుతున్నట్లు కూడా ఆ పోస్టర్లో చూడొచ్చు. ఇలా పలు మాస్ ఎలిమెంట్స్‌తో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం మూవీ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.
ఇక ఈ మూవీ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్‌లోని తుని ప్రాంతంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆయనే దీనికి రైటర్ కూడా. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.