తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అక్షయ్ కుమార్ ఐపీఎల్ పెర్ఫామెన్స్​ - ఒక్క డ్యాన్స్​కు రూ. 2.5 కోట్లు! - Akshay Kumar IPL Remuneration - AKSHAY KUMAR IPL REMUNERATION

Akshay Kumar IPL Remuneration : ఐపీఎల్ అంటేనే అదో గమ్మత్తు. ఇక ఈ టోర్నీ ప్రారంభోత్సవం ఓ రేంజ్​లో ఉంటుంది. సెలబ్రిటీలు, క్రికెటర్లు ఫ్యాన్స్​ ఇలా అందరూ ఒక చోట చేరి సంబరాలు చేసుకుంటారు. ఇక ఎప్పటిలాగే ఈ సారి కూడా ఐపీఎల్ ప్రారంభ వేడుకను ఉర్రూతలూగించేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. బాలీవుడ్ హీరోలు, గాయకులు తమ ఆటపాటలతో అలరించనున్నారు. అయితే ఈ సారి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్​తో ప్రేక్షకులను ఆకట్టుకోననున్నారు. అయితే అక్షయ్ ఈ ఈవెంట్​కు ఎంత రెమ్యూనరేషన్​ తీసుకోనున్నారో తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా. ఇంతకీ ఆయన ఎంత తీసుకున్నారంటే ?

Akshay Kumar IPL Remuneration
Akshay Kumar IPL Remuneration

By ETV Bharat Telugu Team

Published : Mar 22, 2024, 1:00 PM IST

Akshay Kumar IPL Remuneration :ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 17వ సీజన్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్​ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్​తో ఐపీఎల్​కు తెరలేవనుంది. అయితే ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవాన్ని ఉర్రూతలూగించే విధంగా బీసీసీఐ ప్లాన్ చేసింది.

ఇందులో భాగంగా ఐపీఎల్ పిచ్​పై ఉత్కంఠభరితమైన ఆటలు మాత్రమే కాదు బాలీవుడ్ హీరోలు, గాయకులు తమ ఆటపాటలతో అలరించే విధంగా ప్రోగ్రామ్స్​ ఎన్నో ఉన్నాయి. ఇక యాక్షన్ స్టార్లు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, గాయకుడు సోను నిగమ్, దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇవాళ సాయంత్రం (మార్చి 22) జరిగే వేడుకల్లో సందడి చేయనున్నారు.

ఇప్పటికే చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా కలర్​ఫుల్​గా రెడీ అయ్యింది. అయితే ఈసారి అక్షయ్ కుమార్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్​తో స్టేజ్​పై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొనేందుకు అక్షయ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా ?

పలు మీడియా కథనాల ప్రకారం తన హై ఎనర్జీ పెర్ఫార్మెన్స్​కు ఈ బాలీవుడ్ హీరో సుమారు రూ. 2.5 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నారట. ఇది విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. అయినప్పటికీ ఈ వేడుకలో తన పెర్ఫామెన్స్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

గతేడాది ఓ మై గాడ్ 2 సినిమాతో భారీ సక్సెస్​ను తన ఖాతాలో వేసుకున్నారు అక్షయ్. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఆయన మరో భారీ ప్రాజెక్ట్​కు సైన్ చేశారు.'బడే మియా, చోటే మియా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్​తో పాటు బీటౌన్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్​ కూడా కనిపించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, గ్లింప్స్​తో ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేసింది. దీంతో పాటు 'స్కై ఫోర్స్', 'సింగమ్ ఎగైన్', 'వెల్‌కమ్ టు ది జంగిల్', 'హేరా ఫేరీ 3', 'చవేదాత్ మరాఠే వీర్ దౌడ్లే సాత్' వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

'నాటు నాటు' బీటౌన్ వెర్షన్​ - ఆ సాంగ్​కు హుక్​ స్టెప్​ వేసిన అక్షయ్​, టైగర్​

Indias Most Successful Actor : ప్రభాస్​, షారుక్​, రజనీ కాదు.. ఇండియాలో మోస్ట్ స‌క్సెస్​ఫుల్ యాక్ట‌ర్ ఆయనే!

ABOUT THE AUTHOR

...view details