Hyderabad Astrologer Satyanarayana Expired Due To Health Issues : జ్యోతిష్య, వాస్తు పండితుడు, సినిమా ముహూర్త సిద్ధాంతి సత్యనారాయణ చౌదరి కన్నుమూశారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెంనకు చెందిన ఆయన, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 4 రోజులుగా తీవ్ర జ్వరంతో జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో కోలుకోలేకపోయారని వైద్యులు తెలిపినట్లు బంధువులు చెప్పారు. స్వగ్రామంలో గురువారం ఉదయం అత్యక్రియలు జరుగుతాయని తెలిపారు. రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక, సినీ, క్రీడాంశాలపై జ్యోతిష్యాన్ని సత్యనారాయణ చౌదరి విశ్లేషిస్తారు. ఆయనకు భార్య, కూమారుడు, కుమార్తె ఉన్నారు.