Akshay Keerthy Suresh Movie :బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ కలిసి మరో ప్రాజెక్టను తెరకెక్కించనున్నారు. గతంలో వీళ్లద్దరూ కలిసి హేరా ఫేరీ, కట్టా మీటా వంటి సినిమాల్లో కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు అప్పట్లో ఎంత హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో మరో చిత్రం రానుంది. దీంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. హారర్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండటం వల్ల ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న విషయమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ సినిమా కోసం ముగ్గురు హీరోయిన్ల పేర్లు పరిశీలనలో ఉందట. అందులో కీర్తి సురేశ్‌తో పాటు బీటౌన్ బ్యూటీస్ ఆలియా భట్, కియారా అడ్వాణీ ఉండటం విశేషం.
అయితే ఈ హీరోయిన్ల విషయంలో పలు రూమర్స్ ట్రెండ్ అవుతున్నాయి. తొలుత ఈ సినిమా కోసం ఆలియా భట్‌ను హీరో అలాగే డైరెక్టర్ ఓకే చేశారని తెలుస్తోంది. ఇది ఓ వెర్షన్ అయితే, అక్షయ్ కోసం కియారాను మేకర్స్ సెలెక్ట్ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.