తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'దయచేసి నన్ను అలా పిలవొద్దు- చాలా ఇబ్బందిగా ఉంది'- ఫ్యాన్స్​కు అజిత్ ఓపెన్ లెటర్

ఫ్యాన్స్​కు అజిత్ ఓపెన్ లెటర్ - దయచేసి నన్ను అలా పిలవొద్దని రిక్వెస్ట్!

Ajith Kumar Open Letter To Fans
Ajith Kumar (IANS Photo)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Ajith Kumar Open Letter To Fans :తమిళ స్టార్ హీరో అజిత్‌ తన అభిమానుల కోసం ఒక లేఖ విడుదల చేశారు. ఇకపై తనని అజిత్‌ అనే పిలవమని అందులో పేర్కొన్నారు. కొంతమంది తనని దేవుడని (కడవూలే) పిలుస్తున్నారని అది తనని ఎంతో ఇబ్బంది పెడుతుందని తెలిపారు. ఈ మేరకు ఓ లేఖ రిలీజ్ చేశారు.

"పబ్లిక్‌ ఈవెంట్స్‌, మీటింగ్స్‌, లేదా ఎక్కడైనా నేను కనిపించినప్పుడు కడవులే అజిత్‌ అంటూ పలువురు స్లోగన్స్‌ చేస్తున్నారు. ఆ స్లోగన్స్‌ నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయి. నా పేరుకు ఇతర బిరుదులను తగిలించడం నాకు నచ్చడం లేదు. నన్ను నా పేరుతో పిలిస్తే చాలు. ఇకపై ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరుతున్నాను. ఇతరులను ఇబ్బందిపెట్టకుండా హార్డ్‌ వర్క్‌ తో జీవితంలో ముందుకు సాగండి. కుటుంబాన్ని ప్రేమించండి." అని లేఖలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ పేర్కొన్నారు.

గతంలోనూ రిక్వెస్ట్
అయితే అజిత్ ఈ విధంగా రిక్వెస్ట్‌ చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ ఆయన స్టార్‌ ట్యాగ్స్‌ వద్దని విజ్ఞప్తి చేశారు. అజిత్‌, లేదా ఏకే అనే తనని పిలవమన్నారు. 'తల' లేదా మరేదైనా మారు పేరుతో పిలవడం మానేయాలని అభ్యర్థిస్తూ బహిరంగ లేఖ విడుదల చేశారు. అలాగే విశ్వనటుడు కమల్ హాసన్ సైతం గతంలో తన పేరుకు ముందు ట్యాగ్స్ యాడ్ చేయొద్దని కోరారు. తనను అసలు పేరుతోనే పిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఇక అజిత్ అప్​కమింగ్ మూవీస్​ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం తన 62వ చిత్రమైన 'విడా ముయార్చి' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. మగిల్​ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అజిత్‌ సరసన త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కాకుండా 'గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ' అనే ద్విభాష చిత్రంలోనూ నటిస్తున్నారు. అధిక్‌ రవిచంద్రన్‌ డైరెక్షన్​లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా మేకర్స్ విడుదల చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details