తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అజిత్ కార్​ స్టంట్ వీడియో - క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్​! - Ajith Kumar Car Stunt - AJITH KUMAR CAR STUNT

Ajith Kumar Car Stunt : 'విడా ముయార్చి' సినిమా కోసం హీరో అజిత్‌ చేసిన స్టంట్‌ వీడియో వైరల్ అయ్యింది. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారంటూ నెట్టింట ఆరా తీయడం మొదలెట్టారు. అయితే ఈ విషయంపై అజిత్ టీమ్ స్పందించింది.

Ajith Kumar Car Stunt
Ajith Kumar Car Stunt

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 4:50 PM IST

Ajith Kumar Car Stunt :కోలీవుడ్‌ హీరో అజిత్‌ కుమార్ ఇటీవలే విడా ముయర్చి సినిమా కోసం ఓ డేరింగ్ స్టంట్​ చేసిన సంగతి తెలిసిందే. డూప్ లేకుండా ఆయన ఓ ఛేజింగ్ సీన్ చేయగా, కారు కాస్త అదుపుతప్పి బోల్తా పడింది. ఈ వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఆ పోస్ట్​ను చూసి కొందరు ఫ్యాన్స్ అజిత్ డేరింగ్ స్టంట్​కు హ్యాట్సాఫ్​ చెప్పగా, మరికొందరేమో ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారంటూ నెట్టింట టీమ్‌ను అడగటం మొదలెట్టారు. ఇక ఈ విషయంపై మూవీ టీమ్ దీనిపై స్పందించింది.

"ప్రొడక్షన్ టీమ్ షేర్ చేసిన ఆ వీడియో గతేడాది నవంబర్ చివరి వారంలో షూట్ చేసింది. ఇప్పుడు ఆయన హెల్తీగా ఉన్నారు. హైవేపై యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్‌ చేశారు. ఆయన నడిపిన కారు టైరులో గాలి పూర్తిగా తగ్గిపోవడం వల్ల ఆ కారు అలా అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ఉన్న అర్నవ్‌, అజిత్‌లను టీమ్ వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వాళ్లకు ఎటువంటి గాయాలు కాలేదు. మూడు గంటల్లోనే తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు" అని తెలిపింది.

అసలు ఏం జరిగిందంటే ?
గత కొంతకాలంగా ఈ మూవీ చిత్రీకరణకు ఎన్నో సార్లు బ్రేక్ పడినప్పటికీ మేకర్స్ వేగం పుంజుకుని మరీ షూట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు. " ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో" అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. అందులో అజిత్​ కుమార్​ డూప్​ లేకుండా ఓ డేంజరస్​ స్టంట్ చేశారు.

ఓ ఏడారిలో షూట్ చేసిన ఆ సీన్​లో అజిత్​ ఎంతో సాహసోపేతంగా కారు నడిపారు. ఆ కారు కాస్త రోడ్డు పక్కునున్న ఎడారిలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇందులో అజిత్​తో పాటు ఆరవ్ అనే మరో నటుడు ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు, అజిత్ అభిమానులు తనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అతడి డేరింగ్​కు హ్యాట్సాఫ్​ చెప్తున్నారు. ఐదు పదుల వయసులోనూ తన ఎనర్జీటిక్​ మూవ్స్​ చూసి ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఆయన గతంలో తన సినిమాల్లో చేసిన స్టంట్స్​ గురించి చెప్పుకుంటున్నారు.

డూప్​ లేకుండా కారు స్టంట్​ - అజిత్​ డెడికేషన్​కు ఫ్యాన్స్​ ఫిదా - Ajith Kumar Car Stunt

చిరుకు పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో - వచ్చే సంక్రాంతికి 7 సినిమాలు!

ABOUT THE AUTHOR

...view details