తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

సీక్రెట్​గా గుడిలో పెళ్లి చేసుకున్న అదితి రావు హైదరి - సిద్ధార్థ్​ - Aditi Rao Hydari Siddharth Marriage - ADITI RAO HYDARI SIDDHARTH MARRIAGE

Aditi Rao Hydari Siddharth Marriage : గత కొంతకాలంగా రిలేషన్​షిప్​లో ఉన్న టాలీవుడ్ సీనియర్ హీరో సిద్ధార్థ్ - బాలీవుడ్ నటి అదితి రావు హైదరీ గుడిలో సీక్రెట్​గా పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. కానీ, వీరి పెళ్లి గురించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

సీక్రెట్​గా పెళ్లి చేసుకున్న అదితి రావు హైదరి - సిద్ధార్థ్​
సీక్రెట్​గా పెళ్లి చేసుకున్న అదితి రావు హైదరి - సిద్ధార్థ్​

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 12:14 PM IST

Updated : Mar 27, 2024, 12:31 PM IST

Aditi Rao Hydari Siddharth Marriage : టాలీవుడ్ సీనియర్ హీరో సిద్ధార్థ్ మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి అదితి రావు హైదరీని సిద్ధార్థ్ ​సీక్రెట్​గా వివాహం చేసుకున్నట్లు సమాచారం అందింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు కలిసి ఏడడుగులు వేశారట. వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయ మండపంలో వీరి పెళ్లి సింపుల్​గా జరిగిందట. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారట. కానీ, ఈ వివాహ వేడుక గురించి అధికారికంగా ఎవరూ చెప్పలేదు. తమిళనాడు పురోహితులు పెళ్లి తతంతు జరిపించారు. కాగా, వనపర్తి సంస్థానాషుల వారసుల్లో నటి అదితి రావు హైదరి ఒకరన్న సంగతి తెలిసిందే.

కాగా, సిద్ధార్థ్ - అదితి రావ్ హైదరి చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం చాలా మందికి తెలిసిందే. చాలా కాలంగా ఈ జంట ఈవెంట్లకు, సినిమాలకు, పార్టీలకి కలిసి వెళ్తున్నారు. అక్కడ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని మీడియాలో వార్తలు బాగా వచ్చాయి. కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం ఇంతకాలం ఇద్దరు దాటవేస్తూ వచ్చారు. ఫైనల్​గా ఎట్టకేలకు రహస్యంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ అండ్ సర్​ప్రైజ్​ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు ఈ నూతన జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇకపోతే బాయ్స్, నువ్ వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు సిద్దార్థ్. ఈయనకు ఇది రెండో పెళ్లి. అదితికి కూడా ఇది రెండో వివాహమే. 2003లో మేఘన అనే యువతిని సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2007లో విడిపోయారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడి బాధ్యతలను సిద్ధార్థే చూసుకుంటున్నారని తెలిసింది. ఆ తర్వాత సిద్ధార్థ్​ పలువురు హీరోయిన్స్​తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఏవీ నిజం కాలేదు. చివరకు అదితితో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కలిసి మహాసముద్రం అనే చిత్రంలో నటించారు. ఆ సమయంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిందట.

రామ్ చరణ్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఆ 2 క్షణాలు ఏంటో తెలుసా? - Happy Birthday Ramcharan

అడివి శేష్ రిలేషన్​షిప్​ - సీక్రెట్ రివీల్ చేసేసిన డైరెక్టర్​! - Adivi Sesh Relationship

Last Updated : Mar 27, 2024, 12:31 PM IST

ABOUT THE AUTHOR

...view details