తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'ఆదిపురుష్‌'లో ఆ సీన్స్‌ అస్సలు నచ్చలేదు : ప్రశాంత్‌ వర్మ - హనుమాన్ మూవీ

Adipurush Prasanth Varma : భారీ డిజాస్టర్​గా నిలిచిన ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాపై 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 5:16 PM IST

Updated : Jan 27, 2024, 9:00 PM IST

Adipurush Prasanth Varma :హనుమాన్‌ చిత్రంతో(HanuMan Movie) పాన్ ఇండియా లెవల్​లో విజయం సాధించారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఈ మూవీ సక్సెస్‌లో భాగంగా ఆయన హిందీ మీడియాకు ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. దర్శకుడు ఔం రౌత్​ - ప్రభాస్​ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'ఆదిపురుష్‌'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలు తనకెంతో నచ్చాయని అన్నారు. అలాగే మరికొన్ని తనను నిరుత్సాహ పరిచాయని పేర్కొన్నారు.

"ఆదిపురుష్‌ సినిమాలోని కొన్ని సీన్స్​ నాకెంతో నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు నన్ను సర్​ప్రైజ్ చేసింది. అయితే, కొన్ని సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు నాకేమాత్రం నచ్చలేదు. నేనే అయితే వాటిని ఇంకా బాగా తీర్చిదిద్దేవాడిని కదా అనిపించింది. నాకే కాదు, ఏ దర్శకుడికైనా ఆ భావన కలుగుతుంది. ఆ సినిమా రిజల్ట్​ నాపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. టీమ్‌ అందరి సహకారంతో నేను అనుకున్నవిధంగా 'హనుమాన్‌'ను తెరకెక్కించగలిగాను." అని ప్రశాంత్ వర్మ చెప్పారు.

ఇకపోతే ఈ సినిమాలో యంగ్​ హీరో తేజ సజ్జా, బ్యూటీ అమృతా అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌రాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరిలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అక్కగా నటించగా - వినయ్‌రాయ్‌ స్టైలిష్ విలన్​గా ఆకట్టుకున్నారు. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.250 కోట్ల(Hanuman Movie Collections) వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయాల పునరుద్దరణ, సినిమాల నిర్మాణాలకు మాత్రమే ఖర్చుపెట్టనున్నట్లు మూవీటీమ్​ కూడా సక్సెస్​ మీట్​లో వెల్లడించింది.

Jai hanuman Movie sequel : ఈ సినిమాకు సీక్వెల్​ కూడా రాబోతుంది. 'జై హనుమాన్‌' పేరుతో రానున్న ఈ చిత్రంలో ఆంజనేయ స్వామిగా ఓ స్టార్‌ హీరో నటిస్తారని ఇప్పటికే దర్శకుడు ప్రశాంత్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్‌ ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా మొదలయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో.

'హనుమాన్​' మేనియా - 15 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్​ ఎంతంటే ?

హిందీలోనూ 'హనుమాన్' జోరు- KGF, జైలర్​ను దాటేసిన సూపర్​హీరో

Last Updated : Jan 27, 2024, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details