Akhanda 2 Heroine: నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2: తాండవం'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ మేళాలో ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. తాజాగా మేకర్స్ సినిమాలో నటించనున్న హీరోయిన్ పేరును అనౌన్స్ చేశారు. యంగ్ బ్యూటీ సంయుక్త మేనన్ 'అఖండ 2'లో నటించనున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.
'టాలెంటెడ్ నటి సంయుక్తకు అఖండ 2 ప్రాజెక్ట్‌లోకి స్వాగతం. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది' అని మేకర్స్ పోస్ట్ చేశారు. కాగా, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, నందమూరి తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, వరుస హిట్లుతో దూసుకెళ్తున్న టాలీవుడ్ యంగ్ లక్కీ చార్మ్ సంయుక్త మీనన్ కోసం బోయపాటి శక్తివంతమైన మహిళా పాత్రను రాసినట్లు తెలుస్తోంది. కాగా, అఖండ-2లో ప్రగ్యాతో పాటు సంయుక్తకు కూడా సందడి చేయనున్నారు.
హిట్ కాంబోలో నాలుగో సినిమా
బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రం అఖండ-2. వీరి కాంబోలో ఇప్పటికే 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు తెరకెక్కి భారీ హిట్లు కొట్టాయి. దీంతో ఈ సినిమాను దర్శకుడు బోయపాటి ఫుల్ యాక్షన్, బలమైన డ్రామా మేళవింపుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చిత్ర వర్గాలు తెలిపాయి.