తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

'నేను ఇప్పటివరకూ ఎవరికీ ప్రపోజ్‌ చేయలేదు' - డేటింగ్ రూమర్స్​పై ఖుషీ కపూర్ రియాక్షన్! - KHUSHI KAPOOR ON DATING RUMORS

'లవ్‌యాపా' ప్రమోషన్స్​లో ఖుషీ కామెంట్స్ - డేటింగ్ రూమర్స్​పై స్టార్ హీరోయిన్ రిప్లై!

Khushi Kapoor On Dating Rumors
Khushi Kapoor (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2025, 11:13 AM IST

Khushi Kapoor On Dating Rumors :బాలీవుడ్ యంగ్ హీరోయిన్​ ఖుషీ కపూర్‌, ఆమిర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ కాంబినేషన్​లో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'లవ్‌యాపా'. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ ఖుషిీ కపూర్ సినిమా విశేషాలు పంచుకుంది. దాంతో పాటు తన సోదరి జాన్వీ కపూర్ గురించి మాట్లాడింది.

"మీ జీవితానికి సంబంధించి ఎటువంటి రొమాంటిక్‌ మూమెంట్‌ను ఫొటో తీసుకోవాలనుకుంటున్నారు?" అని యాంకర్ ప్రశ్నించగా దానికి "ప్రత్యేకంగా అటువంటివి ఏమీ లేదు. ప్రపోజల్‌కు సంబంధించిన మూమెంట్‌ను మాత్రం నాకు ఫొటో తీసుకోవాలని ఉంది. అది మనకు ఎంతో స్పెషల్ కాబట్టి" అని చెప్పుకొచ్చింది. అయితే "ఎవరికైనా ప్రపోజ్‌ చేశారా?" అని యాంకర్ వెంటనే అడగ్గా, దానికి "నేను ఇప్పటివరకూ ఎవరికీ ప్రపోజ్‌ చేయలేదు" అని తెలిపింది. అయితే 'ది ఆర్చిస్‌' కో స్టార్‌ వేదాంగ్‌ రైనాతో తను ప్రేమలో ఉందంటూ రూమర్స్ వస్తోన్న వేళ ఆమె చేసిన ఈ కామెంట్స్​ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఆ తర్వాత కెరీర్‌ పరంగా జాన్వీతో ఉన్న కాంపిటిషన్​ గురించి అడిగితే, "ఆ ఆలోచన మా ఇద్దరికీ లేదు. మేము పోటీ పడుతున్నామని అనుకోవడం చాలా వింతగా ఉంది. ఒకవేళ మేమిద్దరం కలిసి ఒకే సినిమాలో యాక్ట్‌ చేస్తే, తను నాకంటే బాగా చేయొచ్చు. దాన్ని కూడా నేను నా సక్సెస్​గానే భావిస్తాను. అక్క కూడా అలాగే అంటుంది. నేను ఏదైనా సినిమాలో బాగా యాక్ట్ చేసి ప్రశంసలు అందుకుంటే అది తన గెలుపుగానే చూస్తుంది. అంతే తప్ప మా మధ్య పోటీ ఉంటుందని ఇద్దరూ ఎప్పుడూ అనుకోం" అని ఖుషీ తెలిపింది.

ప్రదీప్‌ రంగనాథన్‌ డైరెక్షన్​లో వచ్చిన 'లవ్‌ టుడే' అటు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి టాక్ అందుకుంది. ముఖ్యంగా నేటితరం యూత్​ను ఈ చిత్రం తెగ ఆకట్టుకుంది. ఇపుడు ఈ సినిమాను 'లవ్‌ యాపా'గా రీమేక్ చేశారు డైరెక్టర్ అద్వైత్‌ చందన్‌. అయితే ప్రదీప్‌ రంగనాథన్‌ నిర్మాతగా వ్యవహరించారు.

అక్కినేని హీరోతో జాన్వీకపూర్​! - ఏ సినిమా కోసం అంటే?

గ్యారేజ్ నిండా కార్స్​ - ముంబయిలో రూ.65 కోట్ల డూప్లెక్స్ హౌస్ - జాన్వీ నెట్​వర్త్ ఎంతంటే? - Janhvi Kapoor Net Worth

ABOUT THE AUTHOR

...view details