Actor Survived Major Accident Runs Business Successfully : 90స్లో ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువ ఉండేది. మణిరత్నం సినీ ఇండస్ట్రీకి అందించిన స్టార్ హీరోల్లో ఈయన ఒకరు. కొంతకాలం వరకూ సినిమాల్లో రాణించిన ఆయన ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లో అదరగొడుతున్నారు. కాలేజీ రోజుల్లోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ వైపు వెళ్లి కొన్ని ప్రకటనలు చేసిన ఆయన తన కెరీర్లో ఎన్నో మర్చిపోలేని మైల్‌స్టోన్స్ దాటారు. ఆయనే హీరో అరవింద స్వామి.
అరవింద స్వామి అంటే అందరికీ ఠక్కున్న గుర్తురాకపోవచ్చు. కానీ 'రోజా' సినిమా హీరో అంటే ఆ మూవీ చూసిన ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. తన క్యారెక్టర్లో నేచురల్‌గా నటించి అంతలా పాపులరయ్యారు ఆయన. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేస్తున్న సమయంలో దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం దృష్టిలో పడ్డారు. అలా 'దళపతి'తో సినీ తెరంగేట్రం చేసి మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన 'రోజా'తో యూత్ ఐకాన్‌గా మారిపోయారు. ఎంతో మంది ఆయన స్టైల్‌ను ఫాలో అయినవారూ కూడా ఉన్నారు.
ఇండస్ట్రీకి దూరమై, బిజినెస్‌లో రాణించి
అయితే ఫేమ్ వచ్చిన కొన్నాళ్లకే అరవింద్ స్వామి ఇండస్ట్రీకి దూరమయ్యారు. తన తండ్రి వ్యాపార బాధ్యతలపై పూర్తిగా దృష్టి సారించారు. కానీ విధి మరోలా తలచింది. హఠాత్తుగా అరవింద్ స్వామికి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ఆయన పాక్షిక పక్షవాతంతో కొన్నేళ్లు బాధపడ్డారు. ఇంటికి పరిమితమయ్యారు. ఆ తర్వాత కోలుకుని వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇంతకీ అరవింద్ ప్రారంభించిన బిజినెస్ ఏది? ఆయన ఆస్తి ఎంతో తెలుసా?