Saif Ali Khan Attack :బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తనపై జరిగిన దాడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అయితే దాడి జరిగిన రాత్రి తాను హాస్పిటల్‌కు వెళ్లేందుకు సహాయం చేసిన ఆటోడ్రైవర్ భజన్ సింగ్ రాణాను ఆయన కలిశారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడానికి ముందు సైఫ్ అతడిని కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
క్లిష్ట సమయంలో తనకు సహాయం చేసినందుకు భజన్‌సింగ్‌కు సైఫ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటో తాజాగా బయటకు వచ్చింది. అయితే సాయం చేసిన డ్రైవర్‌ను గుర్తు పెట్టుకుని మరీ అతడికి థాంక్స్ చెప్పడంతో సైఫ్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు సైఫ్ తల్లి షర్మిలా ఠాగూర్ సైతం డ్రైవర్ సాయాన్ని మెచ్చుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు చెప్పారు.
సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత భజన్‌సింగ్ రాణా గురించి వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడాడు. ఆ రోజు రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఏం జరిగిందో వివరించారు. 'ఆరోజు జరిగింది నాకు బాగా గుర్తుంది. నేను అటునుంచి వెళ్తున్న సమయంలో ఒక మహిళ లగ్జరీ ఇంటి గేటు బయట నిల్చొని ఉన్న మహిళ నన్ను చూసి ఆటో ఆపమని కోరింది. సైఫ్‌ను చూడగానే నేను వెంటనే గుర్తు పట్టలేదు. ఆటోలో ఎక్కిన తర్వాతే ఆయన సైఫ్ అని తెలిసింది. ఆయనతోపాటు ఓ పిల్లాడు, మరో వ్యక్తి ఆటోలో ఎక్కారు'