Ram About Puri Jagannath:టాలీవుడ్ స్టార్ హీరో రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజ్ సినిమా 'డబుల్ ఇస్మార్ట్'. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం (ఆగస్టు 11) వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రామ్ డైరెక్టర్ పూరిని గన్ (తుపాకి)తో పోల్చారు. గన్ ఎంత బాగా పేలిస్తే హీరో బుల్లెట్లా దూసుకుపోతారని రామ్ అన్నారు. అంతేకాకుండా పూరి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు.
'టాలీవుడ్‌కు స్ఫూర్తినిచ్చే దర్శకుడు పూరి జగన్నాథ్. దర్శకుడు, రచయిత కావాలనున్న చాలామంది ఆయన్ను చూసే ఇండస్ట్రీలోకి వచ్చి ఉంటారు. నా ఫోన్లో ఆయన కాంటాక్ట్ గన్ అని సేవ్ చేసుకున్నా. హీరోలు బుల్లెట్ లాంటోళ్లు. గన్ పేలిస్తేనే బుల్లెట్ వెళ్తుంది. అలాంటి గన్ పూరి జగన్నాథ్. ఆయన చాలా మంది హీరోలకు అవసరం. ఆయనతో కలిసి పని చేస్తే వచ్చే కిక్ ఎక్కడా రాదు' అని రామ్ అన్నారు.
'పక్కనోళ్లు, పకోడీల గురించి పట్టించుకోవద్దు'
'మనలో చాలామంది తమ సొంత అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం లేదు. మనం ఓ రెస్టారెంట్‌లో తిన్న బిర్యానీ బాగుంటే మిగిలిన వారు బాగోలేదంటే మనపై మనకు డౌట్ ఉండకూడదు. నేను తిన్నాను బాగుందనుకోవాలి. పక్కవారి ఒపీనియన్ వల్ల నీ ఒపీనియన్ మార్చుకోవద్దు. అది బిర్యానీ అయినా, సినిమా అయినా, మీ కెరీర్ అయినా మీకు నచ్చింది చెయ్యండి. ఎందుకంటే పక్కోళ్ల గురించి, పకోడీల గురించి పట్టించుకుంటే పనులు జరగవు. మీరంతా నా వాళ్లు అనుకుని ఇదంతా చెబుతున్నా' అని రామ్ అన్నారు.