Aa Okkati Adakku Faria Abdullah Tattoo :"జాతిరత్నాలు" తర్వాత తెలుగులో "రావణాసుర", "లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్", తమిళంలో "వల్లి మయిల్" సినిమాల్లో ప్రధాన పాత్రల్లో కనిపించింది ఫరియా. ఇటీవల బంగార్రాజు సినిమాలో కూడా "వాసివాడి తస్సాదియ్యా" పాటకు నాగార్జున, నాగచైతన్యతో కలిసి వయ్యారంగా డాన్స్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే. బేసిక్‌గా మంచి డ్యాన్సర్ అయిన ఫరియా ప్రతి ఈవెంట్‌లో తనలోని సహజమైన టాలెంట్ చూపించుకుంటూ ఉంటుంది. సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పనిచేసిన ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
ప్రస్తుతం అల్లరి నరేశ్‌తో కలిసి ఆ ఒక్కటి అడక్కు సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఓ రిపోర్టర్ ఆమె కాలిపై ఉన్న టాటూకు గల కారణమేంటి, దాని అర్థం ఏంటని ప్రశ్నించారు. దీనికి చిట్టీ చాలా కాన్ఫిడెంట్‌గా సమాధానం కూడా ఇచ్చింది. ఫరియా ఎడమ కాలిపై ఉన్న టాటూని గమనిస్తే, ఎర్రటి వేర్ల గీతలు, దానిపై నీలి రంగులో వృత్తం ఉంటుంది.
"ప్రతి ఒక్కరికీ తమ కెరీర్లో పునాది అనేది చాలా అవసరం. ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన రూట్స్ (వేర్లు) ఎంత బలంగా ఉంటే అంత ఎత్తుకు ఎదగగలం. ప్రత్యేకించి ఇలా పబ్లిక్ లైఫ్‌లో గడిపేవాళ్లు ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. అంతేకాదు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. నా వరకూ నన్ను నేను ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకునేందుకే ఈ టాటూ వేయించుకున్నాను. అంతేకానీ, వేరే ఏమీ లేదు" అని స్పష్టంగా చేప్పింది ఫరియా.
కాగా, అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని 'పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్' అనే కాన్సెప్ట్‌తో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. దీనికి మల్లి అంకం దర్శకత్వం వహిస్తుండగా, రాజీవ్ చిలక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో నాని చేతుల మీదుగా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత అల్లరి నరేశ్ ఈ సినిమాలో మళ్లీ కామెడీ రోల్లో కనిపించనున్నారని తెలిసి నరేశ్ ఫ్యాన్ప్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫరియా అబ్దుల్లా టాటు వెనక అంత కథ ఉందా? - అసలు మ్యాటర్ ఇదే! - Faria Abdullah Tattoo
Aa Okkati Adakku Faria Abdullah Tattoo : "చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాస్సే" అంటూ జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో తిష్ట వేసుకుని కూర్చుంది పొడుగుకాళ్ల సుందరి ఫరియా అబ్దుల్లా. ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా, ఎనర్టిటిక్ కనిపించే ఈ భామ తన సీక్రెట్ టాటూ వెనకున్న కథను చెప్పుకొచ్చింది. తాాజాగా తాను నటించిన 'ఆ ఒక్కటీ అడక్కు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తన కాలిపై ఉన్న టాటూ గురించి అభిమానులతో పంచుకుంది.
.
Published : Apr 22, 2024, 10:28 PM IST