70th National Film Awards : 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందజేస్తున్నారు. 'కార్తికేయ 2' దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారు. కన్నడ నటుడు రిషభ్ శెట్టి, నిత్యా మేనన్ కూడా పురస్కార్వాన్ని స్వీకరించారు. మరోవైపు, మిథున్ చక్రవర్తి దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించారు.
కాగా, 2022కి గానూ కేంద్రం రీసెంట్‌గానే ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసింది. ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతార), ఉత్తమ నటిగా నిత్యా మేనన్ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్) ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్' (మలయాళం), తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'కార్తికేయ 2' నిలిచిన సంగతి తెలిసిందే.
Thiruchitrambalam Nithya Menon National Award : ఇకపోతే జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం దక్కడంపై నటి నిత్య మేనన్ ఈ వేడుకలో స్పందించారు. అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశారు. "నేషనల్ అవార్డు నా కష్టానికి ప్రతిఫలం. 10-15 ఏళ్లుగా చిత్ర సీమలో కొనసాగుతున్నాను. ఇది నేను సంబరాలు చేసుకోవాల్సిన సమయం" అని అన్నారు. మంచి స్క్రిప్ట్‌తో వచ్చిన దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని నిత్య మేనన్ చెప్పారు. ఈ అవార్డును తన తోటి కోస్టార్స్కు, తిరుచిత్రంబలం మూవీటీమ్‌కు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.