70s Super Hit Bollywood Movie in China : పాన్ఇండియా మేనియా నడుస్తున్న తరుణంలో ఎన్నో చిత్రాలు ఓవర్సీస్లోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. ఇప్పుడిది ట్రెండ్ అయినప్పటికీ ఒకప్పుడు ఓ సినిమా వరల్డ్‌వైడ్ క్రేజ్ సంపాదించింది అంటే అది పెద్ద విషయం అని చెప్పాలి. స్టోరీ, యాక్టర్స్ ఇలా అన్నింటిలోనూ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సినిమా అంతటి సక్సెస్ సాధిస్తుంది. ఇదే కోవకు చెందిన ఓ 70స్ బాలీవుడ్ మూవీ చైనాలో ఎన్నో రికార్డులు తిరగరాసింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
1979లో బాలీవుడ్ సూపర్‌స్టార్ జితేంద్ర, ఆశా పరేఖ్ నటించిన 'కారవాన్' మూవీ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి టాక్ అందుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తండ్రి నాజిర్ హుస్సేన్ డైరెక్షన్లో వచ్చింది ఈ సినిమా. నాజర్ హుస్సేన్ సోదరుడు తాహిర్ హుస్సేన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అరుణా ఇరానీ, మెహమూద్ జూనియర్, హెలెన్, రవీంద్ర కపూర్, మదన్ పూరీ లాంటి స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. అప్పట్లోనే ఈ చిత్రం దాదాపు రూ. మూడున్నర కోట్లు వసూళ్లు సాధించి సూపర్ హిట్ టాక్ అందుకుంది.