తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

20 ఏళ్ల క్రితమే స్టార్ హీరో అరుదైన ఘనత - ఒక్క ప్రాజెక్ట్​కు రూ. 700 కోట్ల రెమ్యూనరేషన్! - 700 CRORE REMUNERATION ACTOR

ఒక్క ప్రాజెక్ట్​కు రూ. 700 కోట్ల రెమ్యూనరేషన్​ - 20 ఏళ్ల క్రితమే స్టార్ హీరో అరుదైన ఘనత - ఎవరో తెలుసా?

700 Crore Remuneration Hollywood Actor
700 Crore Remuneration Hollywood Actor (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 6:10 PM IST

700 Crore Remuneration Hollywood Actor : ఏ సినిమా అయినా విజయం సాధించడంలో హీరో కీలక పాత్ర పోషిస్తారు. అందుకే ఇతర నటుల కంటే ఆయనకు భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇస్తుంటారు మేకర్స్. కొందరు పారితోషికం నేరుగా తీసుకోగా, మరికొందరు మాత్రం సినిమాకు వచ్చిన లాభాల్లో వాటాను తమ రెమ్యూనరేషన్​గా తీసుకుంటారు. అయితే ఇప్పటివరకూ ఒక ప్రాజెక్టుకు అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు ఉన్నారు. ఇంతకీ ఆయన ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'మ్యాట్రిక్స్​' ఫ్రాంచైజీ భారీ హిట్
హాలీవుడ్​ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది 'మ్యాట్రిక్స్​' ఫ్రాంచైజీ. 1999లో ఈ సినిమా తొలి పార్ట్ సూపర్ హిట్ టాక్ అందుకోగా, ఆ తర్వాత 2003లో 'ద మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ద మ్యాట్రిక్స్ రివల్యూషన్​' అనే రెండు సీక్వెల్స్​ థియేటర్లలో సందడి చేశాయి. అయితే ఈ రెండు చిత్రాలకు ఏక కాలంలో చిత్రీకరించారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ రెండు సినిమాలు అప్పట్లోనే సూపర్ ​హిట్ టాక్ అందుకుని రికార్డుకెక్కాయి. అంతేకాకుండా సుమారు 1.2 బిలియన్ డాలర్ల వసూళ్లను కొల్లగొట్టాయి.

అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా రికార్డు
అయితే ఈ రెండు సినిమాల్లో ప్రధాన పాత్ర పోషించిన హాలీవుడ్ నటుడు కీను రీవ్స్​, తన నటనతో ఆకట్టుకున్న ఈ స్టార్ వరల్డ్​ వైడ్ ఫ్యాన్స్​ను సంపాదించుకున్నారు. ఆ సీక్వెల్స్ ఆయన్ను సినీ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా చేశాయి. ఆ రెండు సినిమాలకు కలిపి ఆయన సుమారు 156 మిలియన్ డాలర్లు (అప్పటి ఇండియన్​ కరెన్సీలో దాదాపు రూ. 702 కోట్లు) రెమ్యూనరేషన్ అందుకున్నారట.ఈ క్రమంలో ఒక ప్రాజెక్ట్ కోసం అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా కీను రీవ్స్ రికార్డుకెక్కారు.

రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి
ఒకేసారి షూటింగ్ జరుపుకున్న 'ద మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ద మ్యాట్రిక్స్ రివల్యూషన్​' సినిమాల కోసం కీను దాదాపు 30 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట. అలాగే లాభాల్లో వాటాను తీసుకునేందుకు నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు, ఓటీటీలో 'ద మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ద మ్యాట్రిక్స్ రెవల్యూషన్​' టీవీల్లో, ఇతర మాధ్యమాల్లో ప్రసారమై మంచి హిట్ సాధించాయి. దీంతో కీనుకు ఒకే ప్రాజెక్టుకు కింద 156 మిలియన్ డాలర్లు లభించినట్లైంది. అయితే ఇలా ఒకే ప్రాజెక్టు నిర్మాణంలో ఏ నటుడు ఇంత మొత్తంలో పారితోషికం పొందలేదట.

హాలీవుడ్ స్టార్లు టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్, ఇండియన్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ వంటి హీరోల కన్నా 20 ఏళ్ల క్రితమే కీను భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ పొందారు. అంతకుముందు 'స్టార్ వార్స్' సినిమా కోసం అలెక్ గిన్నిస్ 94 మిలియన్ డాలర్ల పారితోషికాన్ని తీసుకున్నారని సమాచారం. అయితే కీను ఆ రికార్డును బ్రేక్ చేశారు.

ఇదిలా ఉండగా, 'ద మ్యాట్రిక్స్ రీలోడెడ్', 'ద మ్యాట్రిక్స్ రెవల్యూషన్​' అనే రెండు సినిమాలను ఒకేసారి చిత్రీకరించారు. ఈ సినిమాలకు కీను సుమారు 156 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్​ను పొందారని సమాచారం. అయితే బ్రూస్ విల్లీస్, టామ్ క్రూజ్, విల్ స్మిత్‌ ఒకే సినిమాకు 100 మిలియన్ డాలర్లు సంపాదించారట. షారుక్ ఖాన్ జవాన్ సినిమాకు ఏకంగా 40 మిలియన్ డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

90స్​లో బ్లాక్​బస్టర్​ స్టార్​ - రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్న తొలి హీరో కూడా ఆయనే! ఇంతకీ ఎవరంటే? - Indian Actor 100 Crore Remuneration

21 ఏళ్లకే 75 మూవీలకు సైన్‌ - 100 ఆటోలు, 100 లారీలు కొనాలనే ప్లాన్‌! - ఈ బీటౌన్​ స్టార్ సక్సెస్ జర్నీ ఇదే!

ABOUT THE AUTHOR

...view details